BigTV English

Anushka Shetty: హాట్ లుక్‌లో అనుష్క‌… రూమ‌ర్స్‌కి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం

Anushka Shetty: హాట్ లుక్‌లో అనుష్క‌… రూమ‌ర్స్‌కి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం

Anushka Shetty:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లుక్‌పై సోష‌ల్ మీడియాలో చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు కార‌ణం ఆమె లేటెస్ట్ ఫొటోస్‌లో చాలా బొద్దుగా క‌నిపించింది. దీంతో అనుష్క అస్స‌లు స‌న్న‌బ‌డ‌లేదంటూ నెటిజ‌న్స్ అనుష్క‌పై కామెంట్స్ వర్షం కురిపించారు.ఈ క‌న్న‌డ బ్యూటీ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లోనూ అదే లుక్‌తో క‌నిపిస్తుందా? అనే కామెంట్స్ కూడా గ‌ట్టిగానే వినిపించాయి. ఈ నేప‌థ్యంలో సినిమా టీమ్ ఈ పుకార్ల‌కు చెక్ పెడుతూ అనుష్క పాత్ర‌కు సంబంధించిన తాజా లుక్‌ను విడుద‌ల చేసింది.


ఈ పోస్టర్ లో అనుష్క చాలా అందంగా కనిపిస్తోంది. విదేశీ లొకేషన్‌లో ఓ బిజీ రోడ్ తనదైన శైలిలో నవ్వుతూ రోడ్ దాటుతున్నట్టుగా ఉంది అనుష్క. హ్యాండ్ బ్యాగ్, ఫుల్ డ్రెస్‌తో ఆమె లుక్ చాల ఆహాట్‌గా ఉంది. క్యాజువల్ అవుట్ ఫిట్ అయినా తన పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాళ‌, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

అనుష్క గ‌త చిత్రం నిశ్శ‌బ్దం. 2020లో రిలీజైంది. దాదాపు రెండున్న‌రేళ్లు అవుతుంది. ఇంత గ్యాప్ త‌ర్వాత ఆమె న‌టిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి పి. మహేష్‌ కుమార్ దర్శకుడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి సిద్ధు అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటించారు.


RamCharan: రామ్‌చరణ్ హాలీవుడ్ మూవీ.. ఆమెనే హీరోయిన్!.. క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్..

Kriti Sanon : పెళ్లి గురించి కృతి స‌న‌న్‌కి ప్ర‌భాస్ ఫోన్‌

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×