Pooja Room Vastu Tips: ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం పూజ గది. అక్కడ కొన్ని క్షణాలు కూర్చున్నా కూడా మనం సానుకూల శక్తిని పొందుతాము. ఇంట్లో సానుకూల శక్తికి కేంద్రంగా ఉండే ఏకైక ప్రదేశం కూడా ఇదే. ఇదిలా ఉంటే పూజ గది అలంకరణ కోసం మనలో చాలా మంది వివిధ రకాల వస్తువులను ఉంచుతారు. కానీ ఇలా అస్సలు చేయకూడదట.
ఎలాంటి అవగాహన లేకుండా ఏవి పడితే అవి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టడం ద్వారా వాస్తు దోషం వస్తుందట. మీరు తెలిసి లేదా తెలియకుండా పూజ గదిలో ఏదైనా ఉంచితే అది మీ ఆనందానికి హానికరం కావచ్చు. కాబట్టి పొరపాటున కూడా పూజగదిలో ఉంచకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వస్తువులను పూజ గుదిలో అస్సలు ఉంచకూడదు
1. పగిలిన విగ్రహాలు, చిరిగిన చిత్ర పటాలు:
ఇంట్లోని పూజగదిలో చాలా దేవుడి విగ్రహాలను ఉంచుతారు. కానీ వీటన్నింటిలోనూ గమనించాల్సిన, ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజ గదిలో విరిగిన విగ్రహాలు, చిరిగిన చిత్ర పటాలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. దీని వల్ల ఇంట్లో గొడవలు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి.. ఏదైనా విగ్రహం పగిలిపోతే.. దానిని పూజ గదిలో ఉంచకుండా పవిత్ర నదిలో పారవేయండి లేదా ఏదైనా ఆలయంలో పెట్టేయండి.
2. డబ్బు, నగలు లేదా విలువైన వస్తువులు:
పూజ గది భక్తి, శాంతికి నిలయం అని చెప్పవచ్చు. ఇది సేఫ్ లేదా బ్యాంక్ లాకర్ కాదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. డబ్బు , విలువైన వస్తువులను పూజ గదిలో ఉంచితే.. అది ఆధ్యాత్మిక శక్తిని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలకు కూడా దారితీస్తుంది. పూజ గదిలో సంపద, ఆస్తికి సంబంధించిన వస్తువులను అస్సలు ఉంచవద్దు. పూజకు సంబంధించిన వస్తువులను మాత్రమే అక్కడ ఉంచండి.
3. తోలు వస్తువులు:
తోలు, ఎముకలు, చనిపోయిన జీవులకు చెందినవని పూజ గది పవిత్రతను పాడు చేస్తాయి. అంతే కాకుండా ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. మీరు చేసే పూజ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. అలాంటి వస్తువులను ఆలయంలో అస్సలు ఉంచకూడదని గుర్తుంచుకోండి.
4. మొబైల్, టీవీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు:
పూజ గదిలో మనం ధ్యానం చేసి ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి ప్రయత్నిస్తాము. మొబైల్, టీవీ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సమీపంలో ఉంచడం వల్ల పూజ చేసే వారి దృష్టి మరలుతుంది. అంతే కాకుండా ఇది మానసిక ప్రశాంతతకు భంగం కలుగిస్తుంది. కాబట్టి, పూజా సమయంలో మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచండి లేదా పూజ గది బయట ఉంచండి.
Also Read: గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు
5. మురికి బట్టలు:
మురికి ప్రతికూలతను ఆకర్షిస్తుందని తెలిసిందే. పూజ గదిలో మురికి బట్టలు ఉండటం అక్కడి శక్తిని కలుషితం చేస్తుందని గుర్తుంచుకోండి. ఇది దేవుని దయ పొందడంలో అడ్డంకులను సృష్టించవచ్చు. కాబట్టి,పూజ చేసే సమయంలో ఎల్లప్పుడూ శుభ్రంగా ,స్వచ్ఛమైన దుస్తులను ఉంచండి.