Lavanya – Raj Tarun: కొన్నాళ్ల క్రితం యంగ్ హీరో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ గురించి ఒక సంచలన విషయం బయటికొచ్చింది. లావణ్య అనే ఒక అమ్మాయి మొదటిసారి మీడియా ముందుకొచ్చి తను, రాజ్ తరుణ్ 16 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని, సహ జీవనం కూడా చేస్తున్నామని చెప్పి బాంబు పేల్చింది. సహ జీవనం మాత్రమే కాకుండా వీరిద్దరికీ సీక్రెట్‌గా పెళ్లి కూడా అయిపోయిందని ఆరోపించింది. కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ తనను పట్టించుకోకుండా వేరే హీరోయిన్‌తో లవ్ ఎఫైర్ పెట్టుకున్నందుకే తను మొదటిసారి మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలా రాజ్ తరుణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసింది లావణ్య. తాజాగా తనపై మరో కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
ఎవరి కథ నిజం.?
రాజ్ తరుణ్, లావణ్య కలిసి కోకాపేటలో ఒక ఇల్లు కొన్నారు. తాజాగా ఆ ఇల్లు విషయంపై మరోసారి ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ప్రస్తుతం రాజ్ తరుణ్‌పై లావణ్య పెట్టిన కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. అందుకే కొన్నాళ్లుగా ఎవరూ మీడియా ముందుకు రాలేదు. దీంతో ఈ వివాదం కాస్త సర్దుకుందనే అనుకున్నారు ప్రేక్షకులు. కానీ అలా జరగలేదని తాజాగా జరిగిన గొడవతో మళ్లీ బయటపడింది. కోకాపేటలో రాజ్ తరుణ్, లావణ్య కలిసి ఉన్న ఇంటి నుండి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య గెంటేసిందని ఆరోపణలు మొదలయ్యాయి. అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే హీరో తల్లిదండ్రులు రోడ్డుపై కూర్చొని ఉన్నారు. అలా ఎందుకు ఉన్నారు అనే ప్రశ్నకు లావణ్య (Lavanya) మరో కథ వినిపించింది.
మరో కేసు
రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రమే కాకుండా మరో 15 మంది వచ్చి తనపై దాడి చేశారని, ఇంటి నుండి బయటికి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చారని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్‌తో పాటు ఆ ఇల్లు కొనడంలో తన కష్టం కూడా ఉందని, ఇద్దరూ కలిసే ఆ ఇల్లు కొన్నారని చెప్పుకొచ్చింది. అయినా కూడా తన ఇంటి నుండి తననే గెంటేయాలని చూస్తున్నారంటూ రాజ్ తరుణ్‌పై, తన తల్లిదండ్రులపై మరోసారి ఫిర్యాదు చేయడానికి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఇప్పటికే రాజ్ తరుణ్‌పై చీటింగ్ కేసు పెట్టిన లావణ్య ఇప్పుడు తనపై దాడి చేయించాడంటూ మరొక కేసు పెట్టడానికి సిద్ధమయ్యింది. అలా రాజ్ తరుణ్‌పై కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.
Also Read: రాజ్ తరుణ్ ఇంటి వివాదంలో లావణ్యకు ట్విస్ట్.. ఇంటి నుండి గెట్ అవుట్..
ఇంటి కోసమే
కోకాపేటలో ఇంటి వద్ద జరిగిన గొడవ గురించి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయల్దేరింది లావణ్య. 15 మందితో కలిసి రాజ్ తరుణ్ (Raj Tarun) తనపై దాడి చేయించాడని ఆరోపించింది. ఆ ఇల్లు రాజ్ తరుణ్ తాతముత్తాలది కాదని, వారిద్దరూ కలిసే ఆ ఇంటికి కష్టపడి కొనుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఇంటి ధర పెరగడం వల్లే దానిని పూర్తిగా తన సొంతం చేసుకోవడం కోసం రాజ్ తరుణ్ ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నాడని తెలిపింది. మొత్తానికి ఈ వివాదంపై రాజ్ తరుణ్ ఇంకా స్పందించలేదు. తన తల్లిదండ్రులు మాత్రమే లావణ్య తమని చాలా టార్చర్ చేసి, ఇంటి నుండి బయటికి గెంటేసిందని తనపై ఆరోపణలు చేస్తున్నారు.