Baby John: రీమేక్స్ అనేవి ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ కాదు. ఓటీటీ అనేది వచ్చిన తర్వాత ఏ భాష సినిమాను ఆ భాషలోనే చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. భాష రాకపోయినా సబ్ టైటిల్స్‌తో మ్యానేజ్ చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ రీమేక్స్‌పై పడింది. ఒరిజినల్ భాషలోనే సినిమాలు చూసేస్తున్నారు కాబట్టి వాటి రీమేక్స్‌పై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి ఉండడం లేదు. అందుకే ఎంతగా ప్రమోషన్స్ చేసినా రీమేక్స్ ఫ్లాప్ అవ్వక తప్పడం లేదు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరొక మూవీ యాడ్ అయ్యింది. అదే వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా నటించిన ‘బేబి జాన్’ (Baby John). ఇటీవల విడుదలయిన ఈ మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై పడింది.
వర్కవుట్ అవ్వలేదు
వరుణ్ ధావన్ హీరోగా అట్లీ నిర్మించిన చిత్రమే ‘బేబి జాన్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తేరీ’ అనే తమిళ సూపర్ హిట్ మూవీకి ఇది రీమేక్. తమిళంలో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సాధారణంగా విజయ్ సినిమాలు.. తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. అలాగే ‘తేరీ’ కూడా ‘పోలీసోడు’ అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. అలా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే సౌత్ సినిమాతో నార్త్ ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నించాడు వరుణ్. కానీ అది అంతలా వర్కవుట్ అయినట్టు అనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ సినిమా పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్‌లో ఆలోచన మొదలయ్యింది.
Also Read: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఆర్జే ఆత్మహత్య..!
సందేహాలు మొదలు
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అప్‌కమింగ్ సినిమాల్లో ‘తేరీ’ రీమేక్ కూడా ఒకటి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) పేరుతో ఆ మూవీని రీమేక్ చేస్తున్నారు పవన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది. కొన్నాళ్ల క్రితం గ్లింప్స్ కూడా విడుదలయ్యింది. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఈ మూవీని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఏ అప్డేట్ బయటికి రావడం లేదు. మరొక రీమేక్ అంటే బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వగలదా అని ఫ్యాన్స్‌లో సందేహం మొదలయ్యింది.
ప్రమోషన్స్‌తో నో యూజ్
‘తేరీ’ సినిమాను ‘పోలీసోడు’ అనే టైటిల్‌తో తెలుగులో డబ్ చేసినప్పుడు దీనిని చాలామంది ప్రేక్షకులు చూసేశారు. ఇప్పుడు అదే కథను మళ్లీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా తీసుకొస్తే ఆదరిస్తారా అని ఫ్యాన్స్‌లో చర్చలు మొదలయ్యాయి. ‘బేబి జాన్’ను కూడా ఎలాగైనా హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో వరుణ్ ధావన్‌తో పాటు అట్లీ, కీర్తి సురేశ్, వామికా గబ్బి.. చాలానే ప్రమోషన్స్ చేశారు. వారు అనుకున్నట్టుగానే చాలామందికి ఇది రీచ్ అయినా ఒక రెగ్యులర్ యాక్షన్ మూవీలాగా ఉంది అంటూ ‘బేబి జాన్’ను పక్కన పెట్టేశారు ఆడియన్స్. మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.