Big Stories

Pitru Dosha: ఈ మొక్క మీ ఇంట్లో పెరుగుతోందా? అయితే పితృ దోషం ఉన్నట్లే.. దానికి ఏం చేయాలంటే?

Pitru Dosham: కొన్నిసార్లు ఇంటి అలంకరణ కోసం కొన్ని మొక్కలను తీసుకువచ్చి పెడుతుంటాం. అయితే మనం పెంచకుండానే మీ ఇంట్లో పెరిగితే దాన్ని వాస్తు శాస్త్ర ప్రకారం దోషంగా భావిస్తారు. రావి చెట్టు మీ ఇంట్లో పెరిగితే మీ పూర్వీకులు మీపైన కోపంగా ఉన్నారని అర్థం.

- Advertisement -

ఎటువంటి కారణం లేకుండా తన జీవితంలో ఏ ఒక్క సమస్యారాదు. దీని వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. అయితే అది పితృ దోషం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో రావి చెట్టు పెరిగే అది పితృ దోషాన్ని సూచిస్తుంది. అయితే ఈ కథనం ద్వారా మీరు పితృ దోషానికి గురైతే.. దానిని నివారించే మార్గం గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు..

- Advertisement -

హిందూ సాంప్రదాయాల ప్రకారం.. రావి చెట్టులో విష్ణువు కొలువై ఉంటాడు. దీంతో రావి చెట్టు వద్ద దీపం వెలిగించి పూజలు చేసే వారికి విష్ణువు అనుగ్రహం ఉండి.. అంతా మంచే జరుగుతుదని నమ్ముతారు. శని గ్రహ దోషం ఉన్నవారు కూడా రావి చెట్టు చుట్టూ తిరిగి.. దానికి నీరు పోయడం ద్వారా దాని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందువులు నమ్ముతారు. అయితే ఈ రావి చెట్టు ఇంట్లో పెరిగే మాత్రం అనేక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

పూర్వీకుల మూలం కలిగిన మొక్క..
వాస్తు శాస్త్రం ప్రకారం, రావి చెట్టు నాటకుండా ఇంట్లో పెరిగితే అది పితృ దోషాన్ని కలిగిస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి, ఆ ఇంట్లో వారు వెంటనే కొన్ని నివారణ మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.లేకుంటే దాని కారణంగా మీ ఇంట్లో వాళ్లు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

పితృ దోషానికి పరిష్కారం ఏంటంటే..?
ఇంట్లో రావి మొక్క సొంతంగా పెరిగితే అది పితృ దోషానికి కారణం కావచ్చు. దీనిని నివారించడానికి.. ఆ ఇంట్లో వారు వెంటనే వారి పూర్వీకులకు తర్పణం చేయాలి.

ఆ రావి మొక్కను ఏం చేయాలంటే?
ఇంట్లో రావి మొక్క దానంతట అదే పెరిగితే, వెంటనే దానిని ఆ ప్రదేశం నుండి తొలగించండి. దాన్ని తొలగించడానికి సరిగ్గా 45 రోజుల ముందు, ప్రతిరోజూ దానికి నీరు సమర్పించి పూజ కూడా చేయాలి. 45 రోజుల తర్వాత, ఈ మొక్కను ఆ స్థలం నుండి తీసివేసి, శుభ్రమైన ప్రదేశంలో నాటాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది. అలాగే, మొక్కకు ఎటువంటి హాని ఉండదు. దీంతో మీపై మీ పూర్వీకులు దోషం పూర్తిగా తొలగిపోతుందని వాస్తు ప్రకారం నమ్మకం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News