Big Stories

Crocodile Vs Snake – Eagle: మొసలి కంటపడిన పాము.. మధ్యలో గద్ద.. చిద్రమైన పాము జీవితం..!

Crocodile Vs Snake – Eagle: మొసలి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. దాని ఆకారం చేస్తే ఓళ్లు గగ్గుర్లు పొడుస్తుంది. ఇక మొసలి వేట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొసలి నోటిలో ఏదైనా పడిందంటే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లే. మొసలి నీటిలో ఉంటే ఎంత పెద్ద జంతువుతోనైనా కబడ్డీ ఆడేస్తుంది. సాధారణంగా మొసలి నీటిలో, బురదలో నక్కి ఉంటుంది. ఈ క్రమంలో దాహం తీర్చుకునేందుకు వచ్చిన గేదెలు, జింకలు తదితర జంతులపై దాడి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అయితే పులులు, సింహాలపై కూడా దాడి చేస్తుంది. ఇప్పుడు తాజాగా మొసలి వేటాడిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే ఈ వీడియోలో మొసలి పామును వేడాడింది. మొసలి నుంచి పాము తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.

- Advertisement -

ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో జరిగింది. దీన్ని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఓ పక్క ఎండలు బాగా మండుతున్నాయి. దీంతో మొసలి ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉంది. అయితే ఇంతలోనే అటుగా వెళుతున్న పెద్ద పాము దాని కంటపడింది. మొసలి మాత్రం అటూఇటూ కదలకుండా ఓపిగ్గా ఉంది. తీరా పాము నీటిలోకి ప్రవేశించాక ఒక్కసారిగా దాడి చేసింది. ఇంతలోనే పాము తప్పించుకునేందుకు వేగంగా ఒడ్డుకు వెళ్లిపోయింది.

- Advertisement -

కానీ అప్పటికే బాగా ఆకలితో ఉన్న మొసలి.. ఎలాగైన తన ఆకలి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. పాము వెనుకనే దానితో పాటు ఒడ్డుకు చేరుకుంది. అక్కడే నక్కి బురదలో మెల్లగా వెళుతున్న పాముపై దాడి చేసింది. తన నోటితో పామున ఉడుంపట్టుపట్టింది. మెల్లిగా నోటిలోకి మింగేసింది. ఇలా మొసలి దాడిలో పాము ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌‌తో దూసుకుపోతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

Also Read: ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి ఇదేం పాడు పని.. స్విగ్గీ బాయ్ ఏం చేశాడో చూడండి

పామును మొసలి ఎన్‌ కౌంటర్ చేసిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మొసలి ఘోరంగా పోరాడి ఆకలి తీర్చకుందని మరొకరు అన్నారు. ఈ నది మొసళ్లతో నిండి ఉందని అంటున్నారు. పాము వేగంగా కదిలి ఉంటే ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. ఈ నదిలో మొసళ్ల గుంపు ఎన్నో జంతువుల ప్రాణాలు తీశాయని మరొకరు కామెంట్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News