BigTV English
Advertisement

Tirumala Gopuram : తిరుమల బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసం…?

Tirumala Gopuram : తిరుమల బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసం…?

Tirumala Gopuram : కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన ఉన్న స్థానంలో బంగారు గోపురంపైన వెండి ద్వారంలో సప్తగిరీశుడు ఉంటాడు.. వెండిద్వారం గోపురంపై పైనున్నస్వామి ప్రదేశాన్ని చూపేందుకు చాలామంది దర్శనం అయ్యాక గోపురం పైనున్న స్వామిని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు. వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు.


మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుడ్ని తీసుకొచ్చాడు. ఆ దర్శనం పశుపక్ష్యాదుల కోసం, దేవతల కోసమట.ఆకాశాన్నుంచి ముక్కోటి దేవతలు దిగి వచ్చి స్వామిని సేవించుకోవడం కోసమే విమాన వెంకటేశ్వరుడి దర్శనం.. మన పగలు, రాత్రితో దేవతులకు సంబంధం లేదు. వారి పూజా సమయం వేరు గనుక, భూమి సమయం కింద నున్న భూమిపై నున్న అన్నీ లోకాల వారికి ఇచ్చే దర్శనం అది.

విమాన వేంకటేశ్వరస్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వేంకటాచలమాహాత్మ్యం ద్వారా తెలుస్తోంది. ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాణ్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం.ఒకవేళ ఆనందనిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వేంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితం దక్కుతుందట. తిరుమల వెళ్లిన వారు తప్పక విమాన వెంకటేశ్వరుడ్ని, పాదాలను దర్శించుకోవాలి. ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలగుతాయి అంతేకాదు సర్వశుభాలు కలుగుతాయట.


Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×