Palm jaggery : కరోనా తర్వాత అందరూ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ చూపిస్తున్నారు. కరోనా వంటి వైరస్‌ల బారిన పడకుండా పోరాడాలంటే కచ్చితంగా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలని డాక్టర్లు అంటున్నారు. అందుకే చాలా మంది పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారు. అయితే మన ఆహారంతో పాటు తాటి బెల్లం రోజూ తీసుకుంటే చక్కటి అమృతంలా పనిచేస్తుందని, అంతేకాకుండా సర్వరోగాలను నివారించే శక్తి ఈ తాటిబెల్లానికి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. తాటిబెల్లం తినడం వల్ల అజీర్తితో పాటు క్యాన్సర్ కారకాలను మన శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. పేగులో పేరుకున్న పలు రోగకారకాలను కూడా సమర్థంగా తొలగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతిరోజు భోజనం తర్వాత తాటిబెల్లం ముక్కను తింటుంటారు. ప్రస్తుతం వాడుతున్న చక్కెరకు ప్రత్యామ్నాయమే ఈ తాటిబెల్లం.
తాటిబెల్లంలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. తాటిబెల్లం మన పేగులను క్లీన్ చేస్తుంది, అంతేకాకుండా బ్లడ్‌లోని హిమోగ్లోబిన్ స్థాయిని బాగా పెంచుతుంది. ఆస్తమా రోగులకు ఇది వరం అని చెప్పవచ్చు. ఇందులోని మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఉన్న కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకలకు బలాన్ని ఇస్తాయి. మహిళల్లో బహిష్టు సమస్యలను కూడా సమర్థంగా అరికడుతుంది. తాటిబెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తశుద్ధి చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తాయి. ఇమ్యూనిటీ పెంచడంతో పాటు శరీరంలోని వేడిని పూర్తిగా తగ్గిస్తుంది, అంతేకాకుండా తాటిబెల్లం తినడం వల్ల నీరసం ఉండదు, మన బాడీకి ఎక్కువ శక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్తికి ఎంతగానో ఈ తాటిబెట్లం ఉపయోగపడుతుంది