E-Paper
Advertisement

Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రతికార పాలన నడుస్తుంది: సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రతికార పాలన నడుస్తుంది: సబితా ఇంద్రారెడ్డి
Advertisement

Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ ప్రతికార పాలన నడిపిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సబితా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు గాలికొదిలేసి పాలన సాగిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో పనిచేస్తున్న పోలీసులకు మాజీ సీఎం అడ్రస్​ తెలియదంటే అవమానించడమేనని అన్నారు.

నోటీసులు ఇచ్చి డైవర్షన్..

కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి సంతోషపడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్(KCR)​ పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్​ఎస్​ బయటపెట్టిన ప్రతి సందర్భంలో నోటీసులు ఇచ్చి డైవర్షన్​ చేస్తున్నారని అన్నారు. సీఎంకు ఫోన్​ ట్యాపింగ్​(Phone Tapping) కు సంబంధం ఉండదు.. పోలీస్ డిపార్టెంట్​లోని ఒక వింగ్ పనిచేస్తుందని అన్నారు. కానీ ప్రస్తుత సీఎం కేసీఆర్​కు ఫోన్​ ట్యాపింగ్​తో సంబంధం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్​‌కు నోటీసులకు ఇవ్వడంపై తెలంగాణ సమాజం బాధపడుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. కక్షపూరిత చర్య దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టంగా అర్ధమైతుందన్నారు.

Advertisement

Also Read: Sreeleela: పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు.. శ్రీలీల ఆశ్చర్యకర వ్యాఖ్యలు..!

బోగ్గు కుంభకోణంపై..

హరీష్ రావు(Harish Rao) బోగ్గు కుంభకోణంపై మాట్లాడిన వెంటనే నోటీసులు ఇచ్చారు.. మరుసటి రోజు కేటీఆర్(KTR)​కు ఈవిధంగా ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. విచారణకు సహకారిస్తాను ఎర్రవెల్లికి వచ్చి నోటీసులు ఇవ్వండీ అని మాజీ సీఎం కేసీఆర్​ వివరించారని తెలిపారు. ప్రభుత్వం మాత్రం కావాలనే ఒక రోజు గ్యాప్​తో నోటీస్​ ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్​ సర్వేపై ప్రతి ఒక్కరూ ప్రశంశల జల్లు కురిపిస్తున్నారని మాజీ మంత్రి సబితా అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చిన బీఆర్​ఎస్​ పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేరని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే మాజీ సీఎం కేసీఆర్​ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

Advertisement

Also Read: Mahabharata: మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు.. అత్యంత దురదృష్టవంతుడు ఆయనే..! ఎవరో తెలుసా..?

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×