BigTV English

Horoscope 24 September 2024: నేటి రాశి పలాలు.. ఊహించని ధనలాభం! అవివాహితులకు వివాహం నిశ్చయం!

Horoscope 24 September 2024: నేటి రాశి పలాలు.. ఊహించని ధనలాభం! అవివాహితులకు వివాహం నిశ్చయం!

Horoscope 24 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేషరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తోటివారి సహాయంతో పనులు పూర్తిచేస్తారు. పట్టుదలతో విజయం పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

వృషభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. తోటివారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయాలి. సూర్యనమస్కారంతో మంచి జరుగుతుంది.


మిథునం:
మిథున రాశి వారికి ఫలప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగులకు ఉన్నత పదవులు వరిస్తాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో సమస్యలు రావొచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి యోగకరంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలు సాధిస్తారు. లాభాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్త వింటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉన్నతాధికారుల ప్రశంసలతోపాటు ప్రమోషన్స్ ఉంటాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.

సింహం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విశ్రాంతి అవసరం. కోపాన్ని దరిచేరనీయవద్దు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

కన్య:
ఈ రాశి వారికి యోగకరంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో అనుకున్న సమయానికే పనులు పూర్తవుతాయి. సంపూర్ణకార్యసిద్ధి ఉంది. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢంగా ఉంటుంది. సంపూర్ణ మనోబలం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. పదవీయోగం ఉంది. విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

Also Read: ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయా.. ఈ నివారణ చర్యలు పాటించండి

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. ముఖ్యమైన పనుల్లో తోటివారి సహకారం తీసుకోవాలి. శారీరక శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనుభవం ఉన్నవారి సలహామేరకు నడుచుకోవాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. ఊహించని ధనలాభం ఉంటుంది. దైవబలం అనుకూలిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. శ్రీలక్ష్మీదేవి సందర్శనం మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మంచి శుభవార్త వింటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల సహకారంతో విజయం పొందుతారు. ప్రయాణాలు ఉంటాయి. కీలక విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.

మకరం:
మకరరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో ఆర్థిక విజయాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. అవసరానికి సహాయం అందుతుంది. బంధుప్రీతి ఉంటుంది. ఆస్తుల వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవత ఆలయ సందర్శన శుభప్రదం.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపం, ఒత్తిడి, చిరాకు వంటి వాటిని దరిచేరనీయకండి. ఖర్చుల విషయంలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంది. మంచి పనులను ప్రారంభిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. గురుధ్యానం శ్రేయస్కరం.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×