BigTV English

OTT Movie : అదిరిపోయే కోర్టు రూమ్ డ్రామా… ఆ ఒక్క హక్కు కోసం ఇంత పోరాడారా?

OTT Movie : అదిరిపోయే కోర్టు రూమ్ డ్రామా… ఆ ఒక్క హక్కు కోసం ఇంత పోరాడారా?

OTT Movie : ఓటిటిలో వచ్చే సినిమాలకు స్టార్ క్యాస్ట్, పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ వంటి లెక్కలేమీ అక్కర్లేదు. మంచి కంటెంట్ ఉంటే సరిపోతుంది. ఇక ప్రమోషన్స్ వంటివి అవసరమే లేదు.  స్టార్లను నమ్ముకోకుండా కథలకు ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలకు ఓటిటిలో ఊహించని రేంజ్ లో ఆదరణ దక్కుతోంది. అందుకే చాలా సినిమాలు సైలెంట్ గా ఓటీటీలోకి వస్తున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా, భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ఓ రేంజ్ లో వ్యూస్ తో కుమ్మేస్తున్నారు ఓటిటి మూవీ లవర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్,  అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఎన్నో ఓటిటిలు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో పక్కా తెలుగు కంటెంట్ అందించే ఓటీటీలు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిలో ఒకటి ఈటీవీ విన్. తాజాగా ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఒకటి రిలీజ్ కు రెడీ అయింది. సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాలో పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యాక్టర్ రవి శంకర్, శశాంక్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఈటీవీ విన్ జనాలకు ఆర్టిఐ పవర్ ఏంటో తెలియాలి. సెప్టెంబర్ 26న ఆర్టిఐ ఈటీవీ విన్ ఓటిటిలో ప్రీమియర్ కానుంది అనే క్యాప్షన్ తో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఒకవేళ కోర్టు రూమ్ డ్రామాలకు పిచ్చి ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఈ సినిమాపై ఓ లుక్కేయండి.


Naandhi Movie Review: A powerful subject backed by power-packed performances

స్టోరీ లోకి వెళ్తే…

ఈ సినిమా పేరు ఆర్టిఐ. టైటిల్ కు తగ్గట్టుగానే ఆర్.టి.ఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అని అర్థం. తెలుగులో చెప్పాలంటే సమాచార హక్కు చట్టం. భారత ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన ఈ చట్టం సాధారణ జనాలకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా సరే ఎలాంటి సమాచారం అయినా పొందగలరు. సామాన్య ప్రజలు తెలుసుకోవాలనుకున్న సమాచారాన్ని ఎలాంటి దాగుడు మూతలు లేకుండా తెలుసుకోగలుగుతారు. ఇప్పటికీ ఈ చట్టం గురించి చాలా మందికి అసలు ఐడియా లేదు. ఇంతటి శక్తివంతమైన చట్టం గురించి చెప్తూ ఈ ఆర్టిఐ అనే మూవీ ని తీశారు మేకర్స్. ఇక సినిమాలో రవి శంకర్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరూ పవర్ ఫుల్ లాయర్ల పాత్రలో నటించారు. అయితే ఆ చట్టాన్ని సాధారణ పౌరుడికి అందించడం కోసం ఎంతగా పోరాడారు? దానివల్ల ఉపయోగం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 26న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాను చూడాల్సిందే.

Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×