Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది.. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో వారం ఎలిమినేషన్ కోసం హౌస్ లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మూడు వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉండగా నిన్న మధ్యాహ్నం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది.. ఈసారి కంటెస్టెంట్స్ ఎక్కడా తగ్గేదేలే అని తమ కన్నా స్ట్రాంగ్ ఉన్నవారిని నామినేట్ చేస్తున్నారు. నబీల్, సోనియా, మణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం,పృథ్వీ రాజ్. గత రెండు వారాల్లో వరుసగా రెండు సార్లు 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ వారం మాత్రం కేవలం 6 మంది మాత్రమే నామినేట్ అయ్యారు. అందులో స్ట్రాంగ్ లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నామినేషన్స్ ప్రక్రియ లో సోనియా, నబీల్ మధ్య భారీ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. సోనియా ఎప్పటి లాగానే తన నోటి దూలని ప్రదర్శించింది. నబీల్ క్యారక్టర్ పై కొన్ని మాటలు వదిలేసింది. ఎపిసోడ్ లో వీరి గొడవ హైలెట్ గా నిలిచింది. సోనియా నబీల్ తో మాట్లాడుతూ ‘సంచలాక్ గా నువ్వు కరెక్ట్ కాదు. కేవలం సంచాలకే గా మాత్రమే కాదు, మనిషిగా కూడా నువ్వు కరెక్ట్ కాదు’ అని అంటుంది. దానికి నబిల్ కూడా ఏం తక్కువ కాదని రచ్చ రచ్చ చేశాడు. సోనియాకు మొదటి నుంచి నోటి దూల కాస్త ఎక్కువగానే ఉంది. తాను గెలవడం కోసం ఎవరు అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు అనేస్తుంది.. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో వారం పాటు సైలెంట్ గా ఉంటూ మళ్లీ అందరిని గెలుకుతుంది.
అందుతున్న సమాచారం మేరకు ఈ వారం సోనియా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె నోటి దూలే అందుకు కారణం అని తెలుస్తుంది.. అందులోనూ మర్యాద లేకుండా మాట్లాడుతుందనే నెగిటివిటిని మూట గట్టుకుంది.. దీంతో ఈమె ఎలిమినేట్ అవ్వడం పక్కా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇకపోతే నైనికా కూడా నామినేషన్స్ లోకి వచ్చింది కానీ, నిఖిల్ ఆమెని తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుండి తప్పించి సేవ్ చేస్తాడు. అందరూ సోనియా ని నిఖిల్ సేవ్ చేస్తాడని అనుకుంటారు కానీ, నిఖిల్ నైనికా ని సేవ్ చేసి కంటెస్టెంట్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. మొత్తానికి నిఖిల్ సోనియా నుండి విడిపోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ వారం వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది.. ఓటింగ్ ప్రకారం చూస్తే ఈమె అతి తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉంది. ఇక టాస్క్ లలో బాగా ఆడితే ఓటింగ్ మారవచ్చు ఏమో చూడాలి..