BigTV English

Surya Nakshatra Gochar 2024: ఈ 3 రాశుల వారికి నేటి నుంచి అన్నీ ప్రత్యేకమైన రోజులే

Surya Nakshatra Gochar 2024: ఈ 3 రాశుల వారికి నేటి నుంచి అన్నీ ప్రత్యేకమైన రోజులే
Advertisement

Surya Nakshatra Gochar 2024: శనివారం అంటే నేడు చాలా ప్రత్యేకమైన రోజు. జూన్ 22 న గ్రహాల రాజు సూర్యుడు తన నక్షత్రాన్ని మారుస్తాడు. ప్రస్తుతం సూర్యుడు మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 15న సూర్యుడు వృషభం నుండి మిధునరాశిలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. నేడు సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుని ఈ నక్షత్ర మార్పు రాత్రి అంటే ఉదయం 12.16 గంటలకు జరుగుతుంది. సూర్యుడి ప్రవేశం కారణంగా ఏ రాశుల వారికి శుభం జరగనుందో తెలుసుకుందాం.


మేష రాశి

మేష రాశి వారికి నేటి నుండి అద్భుతమైన సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారం చేయడం వల్ల ఆర్థిక లాభాలకు పూర్తి అవకాశం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. అదృష్టం ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ప్రేమ జీవితంలో భాగస్వామికి భావాలను వ్యక్తపరచగలరు.


మిథున రాశి

మిథున రాశి వారికి అదృష్టం పడుతుంది. ఇవాళ్టి నుంచి ఈ రాశివారి గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం కలహాలు ఉంటే అన్ని తొలగిపోయి సంతోషంగా ఉంటారు. లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ కాలం ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే జాబ్ ఆఫర్ పొందవచ్చు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి అనుకూలమైన రోజులు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా గొడవలు జరిగితే ఇప్పుడిప్పుడే సమసిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సామాజిక సంక్షేమంలో ముందుంటారు. ఒంటరిగా ఉండి, జీవిత భాగస్వామి కోసం చాలా కాలంగా చూస్తున్నట్లయితే పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి.

Tags

Related News

Diwali 2025: దీపావళికి కొత్త వస్తువులు కొనొచ్చా ? ఈ రోజు పొరపాటున చేయకూడని పనులివే !

Diwali 2025 Upay: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

Dhanteras 2025: ధన త్రయోదశి నాడు ఈ సమయంలో బంగారం కొంటే.. కుబేరులవుతారు

Diwali 2025: దీపావళి రోజు.. లక్ష్మీ దేవిని పూజించే సరైన పద్ధతి ఏంటో తెలుసా ?

Diwali 2025: దీపావళి రోజు ఇంటికి ఇవి కొని తెస్తే .. అష్టైశ్వర్యాలు కలుగుతాయ్

Wakeup at Night: రాత్రి ఆ సమయంలో నిద్రలేస్తున్నారా.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

Diwali 2025: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

Diwali: భార్య చేసే ఈ ఒక్క ట్రిక్ తో భర్త సుడి తిరగడం ఖాయం.. ఏంటీ ఆ రహస్యం

Big Stories

×