BigTV English

Jharkhand Hemant Soren: ఝార్ఖండ్‌లో బిజేపీని మట్టికరిపించిన హేమంత్ సొరేన్.. ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు తారుమారు!

Jharkhand Hemant Soren: ఝార్ఖండ్‌లో బిజేపీని మట్టికరిపించిన హేమంత్ సొరేన్.. ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు తారుమారు!

Jharkhand Hemant Soren| ఝూర్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. ఇండియా కూటమిలోని ఝూర్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ పార్టీలు సంయుక్తంగా మెజారిటీ మార్క్(42)ని అధిగమించాయి. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుదు బిజేపీ ముందంజలో ఉండగా.. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ నాయకత్వంలోని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేసింది. ఆ తరువాత క్రమంగా ఓట్ల లెక్కింపులో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 10.30 కల్లా ఇండియా కూటమి 51 సీట్లలో ముందంజలో ఉంది. మరోవైపు బిజేపీ ఎన్డీఏ కూటమి 29 సీట్లు లీడ్ లో ఉంది.


2019 అసెంబ్లీ ఫలితాలు చూస్తే.. జెఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ (ఆర్‌జెడి) పార్టీల కూటమికి 47 సీట్లు దక్కాయి. ఒక్క జెఎంఎం 30 సీట్లలో విజయం సాధించింది. మరోవైపు బిజేపీకి 25 సీట్లు లభించాయి.

కొన్ని నెలల క్రితం జెఎంఎం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యాక. జెఎంఎం పార్టీలో నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. అయితే హేమంత్ సొరేన్ జైలు నుంచి బయటికి వచ్చి తిరిగి పార్టీని గాడిలో పెట్టారు. ఎన్నికల ప్రచారంలో బిజేపీ పై వాడి వేడి అస్త్రాలను సంధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తారుమారు చేస్తూ.. మేజక్ ఫిగర్ 42ను దాటి 50 సీట్లలో విజయం సాధించడానికి హేమంత్ సొరేన్ ఎన్నికల ప్రణాళిక కీలక పోషించిందనడంతో సందేహం లేదు. ఫలితంగా ఇప్పుడు మూడోసారి రాష్ట్రంలో సొరేన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు.


Also Read: Sanjay Raut: ‘మహారాష్ట్ర ఎన్నికల్లో అంతా మోసం.. అదానీ సాయంతోనే మహాయుతి గెలుపు’

మరోవైపు ఝూర్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజేపీ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా.. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వలసదారుల అంశాన్ని లేవనెత్తారు. సొరేన్ ప్రభుత్వం వల్లనే బంగ్లాదేశీయులు ఝార్ఖండ్ లో వచ్చి స్థిరపడుతున్నారని పదే పదే ఎన్నికల ర్యాలీలో చెప్పారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల వల్ల ఝూర్ఖండ్ భూమి, మహిళలు, ఆహారం ప్రమాదంలో ఉన్నాయని.. ఝూర్ఖండ్ లోని ఆదివాసీల భూములు, అడవులను బంగ్లాదేశీయులు ఆక్రమించుకుంటారిన హెచ్చిరించారు.

కానీ జెఎంఎం మాత్రం ఇందుకు భిన్నంగా సంక్షేమ పథకాల ప్రచారంతో ముందుకువెళ్లింది. ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన (తల్లల సంక్షేమ పథకం), ఆదివాసీ అస్మిత (ఆదివాసీల ఆత్మగౌరవం) నినాదంతో ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.1000 ప్రభుత్వం అందిస్తోంది.

అయితే హేమంత్ సొరేన్ కు ఈ విజయం అంత సునాయాసంగా దక్కలేదు. ఆమె పార్టీ నుంచి కీలక నేతలు బిజేపీలో చేరడంతో చాలా నష్టం చవిచూశారు. హెమంత్ సొరేన్ సొంత వదిన సీతా సొరేన్ బిజేపీ కండువా కప్పుకున్నారు. జనవరి 31 2024న ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో సిఎం హేమంత్ సొరేన్ ని అరెస్టు చేసిన తరువాత జెఎంఎం సీనియర్ నాయకుడు చంపయి సొరేన్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. కానీ హేమంత్ సొరేన్ బెయిల్ పై విడుదలై తిరిగి వచ్చిన తరువాత చంపయి సొరేన్ సిఎం పదవి నుంచి దిగాల్సి వచ్చింది. దీంతో చంపయి సొరేన్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు.

చివరికి అసెంబ్లీ ఎన్నికల ముందు చంపయి సొరేన్ బిజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కీలక నాయకులు పార్టీ వీడినా హేమంత్ సొరేన్ ధైర్యంతో ప్రచారాన్ని అన్నీ తానై ముందుకు నడిపారు. బిజేపీ తప్పులను ప్రజలకు ఎత్తి చూపుతూ చివరికి అనుకున్నది సాధించారు.

Related News

Cough Syrup: దగ్గు మందు మరణాలు.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

IAF Chief: అవన్నీ కట్టుకథలు.. ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

No Internet: 2 గంటలు ఇంటర్నెట్ బంద్, రోడ్లపైకి పోలీసు బలగాలు.. అసలు ఏం జరుగుతోంది?

Tomato virus: పిల్లల్లో టమాటా వైరస్.. ఇది ఎలా వ్యాప్తి చెందుతోంది? లక్షణాలేమిటీ?

Rajasthan News: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ చిచ్చు.. టెస్ట్ చేసిన డాక్టర్‌కి ఏమైంది?

Rabi Crops MSP Hike: పండుగ రోజు రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఆరు పంటల మద్దతు ధరలు పెంపు

Bengaluru metro: మెట్రోలో తిట్టుకున్న మహిళామణులు.. హిందీలో మాట్లాడినందుకు రచ్చ రచ్చ

First 3D Printed House: దేశంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఇల్లు.. కేంద్రమంత్రి ప్రారంభం, తక్కువ ఖర్చు కూడా

Big Stories

×