BigTV English

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Tulasi Plant: హిందూ సాంప్రదాయం ప్రకారం తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసి మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైందని చెబుతుంటారు. అందుకే తులసి మొక్క ఉన్న ఇంటిపై లక్ష్మీదేవితో పాటు శ్రీ మహా విష్ణువు అనుగ్రహం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం తులసిని క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అంతే కాకుండా ఇది నర దృష్టి నుంచి కూడా తులసి రక్షిస్తుంది. తులసిలో 5 రకాలు ఉంటాయి. ఈ తులసి మొక్కలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. ఇంట్లో తులసి చెట్టు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ నియమాలను తప్పక తెలుసుకోవాలి.


తులసి చెట్టుకు సంబంధించిన నియమాలు..
స్నానం చేయకుండా తులసి ఆకులను తెంపకూడదని వాయు పురాణంలో చెప్పబడింది. స్నానం చేయకుండా తులసికి పూజ చేస్తే వారు అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతే కాకుండా అలా పూజ చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం ఉండదు. సాయంత్రం పూట తులసిని పూజించకూడదు. ఆకులు కూడా తెంపకూడదు.

ఆదివారం, ఏకాదశి నాడు నైవేద్యం పెట్టకూడదనేది మొదటి నియమం. సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన చేతులతో మాత్రమే తులసి మొక్కను తాకాలి. ముఖ్యంగా ఆదివారం, శుక్రవారం, అమావాస్య, గ్రహణం, ద్వాదశి రోజుల్లో కూడా తులసి ఆకులను తీయకూడదు. దీంతో పాటు, ప్రత్యేక ప్రయోజనం లేకుండా తులసి ఆకులను తీయవద్దు. తులసి ఆకులను ఎప్పుడూ గోళ్లతో తెంపకూడదు. తులసి మొక్క నుండి రాలిన ఆకులను వైద్యం, ఇతర మతపరమైన అవసరాలలో ఉపయోగించాలి. ఒక వేల రాలిన తులసి ఆకులను ఉపయోగించకనపోతే మాత్రం మట్టిలో వాటిని పాతి పెట్టాలి.


 

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×