BigTV English

Ugadi Panchangam 2025: మేషరాశికి మొదలైన ఏలినాటి శని – ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసా..?

Ugadi Panchangam 2025: మేషరాశికి మొదలైన ఏలినాటి శని – ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసా..?

Ugadi Panchangam 2025: మేష రాశి జాతకులకు మార్చి 23 నుంచి  ఏలినాటి శని ప్రారంభం కానుంది. అయితే నూతన తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మేష రాశి జాతకులకు ఆదాయం-2, వ్యయం – 14 కాగా రాజపూజ్యం – 5, అవమానం -7గా ఉంది. అయితే ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందే ఈ కథనంలో తెలుసుకుందాం.


ఏప్రిల్ : ఈ మాసం వృత్తిపరంగా తెలియని విషయాలను తెలుసుకుంటారు. నిరాడంబరతకు ప్రాముఖ్యమిస్తారు. ఒక మంచి పనికి గాను విరాళాలను ఇస్తారు. ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధను అధికంగా కనబరుస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ స్పందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మే :  పారిశ్రామిక రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది.  సంఘంలో  పేరు, ప్రశంసలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.  స్పెక్యులేషన్ వైపుకు మొగ్గు చూపే కన్నా సంతానం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధని కనబరుస్తారు. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు.


జూన్ : సంఘంలో ఆకర్షణ బిందువుగా ఉండాలనుకుంటారు. జీవితభాగస్వామి నుండి సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సాగిస్తారు. వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరావళి కుంకుమ, సుమంగళీ పసుపుతో అర్చన చేయండి. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

జూలై :  వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. రాజకీయ, కళా రంగాల వారికి ప్రోత్సాహంగా ఉంటుంది. క్రయ, విక్రయాలలో తొందరపాటు పనికి రాదు. దైవ దర్శనం చేసుకుంటారు. కొద్దిపాటి ఒడిదుడుకులు మినహా ఈ మాసం సాఫీగా సాగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అవకాశాలు కలిసి వస్తాయి.

ఆగష్టు : ఆర్థికపరమైన లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల నుండి బయటపడతారు. ఎంతోకాలంగా ఊరిస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూములు, వాహనాలు, స్థలాల అమ్మకాలు, కొనుగోలు చేస్తారు. ఆత్మీయ వర్గానికి ధన సహాయం చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. విధి నిర్వహణలో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

సెప్టెంబర్ : నేర్పుతో ముఖ్యుల వద్ద గుర్తింపు పొందుతారు. సంఘ సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొంతమేర ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తలు అవసరం. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. శుభకార్యాలలో మీ వంతు సహాయం అందిస్తారు. భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు.

అక్టోబర్ : సంఘ సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విరాళాలు సేకరిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా అనుకూలమైన పరిస్థితి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. పెద్దల సలహాతో కీలక విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. మామూలు ప్రమిదలతో దీపారాధన చేయడం కన్నా లక్ష్మీ ప్రమిదలతో దీపారాధన చేయడం వలన లక్ష రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. నూతన పెట్టుబడులుకు అనుకూల కాలం. రుణ బాధల నుంచి బయట పడతారు. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి.

నవంబర్ : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. అనుకోని అవకాశాలు కలిసివస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.

డిసెంబర్‌: భూముల విషయంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. పెట్టుబడులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దు. నూతన ఒప్పందాలలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నిర్ణయాలతో ఏకీభవించాలి. అకస్మాత్తుగా ప్రయాణములు చేయాల్సి వస్తుంది. బంధు మిత్రులతో శత్రుత్వములు పెరుగుతాయి.

జనవరి ( 2026): ఉద్యోగులకు అనుకూలతలు పెరుగుతాయి. ఆఫీసులో కింది స్థాయి ఉద్యోగులచే మోసపోయే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. వివిధ రూపంలో ఉన్న కష్టాలు పెరుగుతాయి. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఫిబ్రవరి ( 2026): ఈ నెలలో చేసిన ప్రయత్నలు యందు జయము పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం కలుగుతుంది. వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి ఆలోచిస్తారు. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. అధికార ప్రాప్తి కలుగుతుంది. ధన లాభములు సంభవిస్తాయి. రావసిన సొమ్ము చేతికి అందుతుంది.

మార్చి ( 2026):  వ్యాపార భాగస్వాములతో మోసపోయే అవకాశం ఉంది. ఇంట్లో అభివృద్ది పనులు జరుగును. ఉద్యోగముల యందు ప్రమోషన్లు కలుగును. దూర ప్రాంతాలకు ప్రయాణ సమయంలో ధన నష్టం జరిగే సూచనలున్నాయి. చేతి వృత్తుల వాళ్లకు  స్థిరత్వం ఏర్పడును. ధర్మకార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.

 

ALSO READ: 2025 లో విపరీతమైన ధనయోగం పట్టబోయే ఐదు రాశులు ఇవే – అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి

 

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×