BigTV English

Ugadi Wishes 2025: తెలుగు వాళ్ల తొలి పండుగ.. ఈ అద్భుతమైన సందేశాలతో ఉగాది విషెస్ చెప్పండి ఇలా..!

Ugadi Wishes 2025: తెలుగు వాళ్ల తొలి పండుగ.. ఈ అద్భుతమైన సందేశాలతో ఉగాది విషెస్ చెప్పండి ఇలా..!

Ugadi Wishes 2025: అందరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు. కొత్త బట్టలు వేసుకోవడంతో మొదలు పెట్టి.. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఇలాంటి అద్బుతమైన విషయాల కలయిక ఈ పండుగ. ఉగాది రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది. యుగ అంటే శకం, ఆది అంటే మొదలు.. మొత్తంగా ఒక శకానికి మొదలు అనే అర్ధం వస్తుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉగాది అని, కర్ణాటకలో యుగాది అని, మహారాష్ట్రలో గుడి పాడ్వా అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంది.


ఉగాది నాడు మనం గమనించే రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది ఉగాది పచ్చడి అయితే.. రెండవది పంచాంగం శ్రవణం. అంటే ప్రతి సంవత్సరం ఒక వేద పండితుడి ద్వారా తెలుగు క్యాలెండర్‌లో ఉన్న విశేష వివరణ వినడం జరుగుతుంది. ఈ పండుగ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఈ రోజే బ్రహ్మ దేవుడు ప్రపంచాన్ని సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ఉగాది మార్చి 30వ తేదీనా వచ్చింది. ఉగాది పండుగ తెలుగువారికి తొలి పండుగ.. మరి ఈ స్పెషల్ డే రోజున మీ స్నేహితులకు, బంధుమిత్రులకు, ప్రియమైనవారికి అందంగా ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..


⦿ తిమిరాన్ని పారదోలే ఉషోదయంలా.. చిగురాకుల ఊయలలో.. నవరాగాల కోయిలలా.. అడుగిడుతున్న ఉగాదికి స్వాగతం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.

⦿ తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సవాలు పూయించుకునేందుకు వస్తుంది ఉగాది పర్వదినం.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.

⦿ మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

⦿ మామిడి పువ్వుకి మాట వచ్చింది.. కోకిల గొంతుకి కూత వచ్చింది.. వేప కొమ్మకి పూత వచ్చింది. పసిడి బెల్లం తోడు వచ్చింది.. గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది. పండుగ మన ముందుకు వచ్చింది. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.

⦿ కొత్త ప్రారంభాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆశీర్వాదాలతో మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ శ్రీ కోధినామ సంవత్సర శుభాకాంక్షలు.

⦿ ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్ని జరగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

⦿ ఈ ఆనందకరమైన కొత్త సంవత్సరంలో భగవంతుడు మీకు ఆశీర్వచనాలు , ఆరోగ్యం, శ్రేయస్సులు కలుగజేయాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

Also Read: ఒకే రాశిలోకి 8 గ్రహాలు.. అనుగ్రహమా? అరిష్టమా? ఏం జరగబోతోంది?

⦿ ఈ ఉగాది మీకు అంతులేని ఆనందం, విజయం, కొప్ప జ్ఞాపకాలను మిగల్చాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

⦿ మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

⦿ కృతజ్ఞతతో, ఆశతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి.. మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×