Railway Ticket Cancellation: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. సులభంగా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు అనివార్య కారణాలతో టికెట్లు క్యాన్సిల్ చేసేకునే వెసులుబాటు కల్పిస్తున్నది. రైల్వే ప్రయాణీకుల సౌకర్యం కోసం రిజర్వేషన్ టికెట్ బుకింగ్ విషయంలో కీలక మార్పులు చేసింది. టికెట్ క్యాన్సిలేషన్ ప్రక్రియను మరింత ఈజీ చేసింది. ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ఆన్ లైన్ లోనే క్యాన్సిలేషన్ చేస్తున్నారు. కానీ, ఇకపై రైల్వే కౌంటర్ లో టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు కూడా ఆన్ లైన్ ద్వారా టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
కౌంటర్ టికెట్ ఆన్ లైన్ లో క్యాన్సిల్
టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్లు, రైల్వే స్టేషన్లకు సమీపంలో ఉండేవాళ్లు రైల్వే కౌంటర్ లోనే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. గతంలో రైల్వే కౌంట్లర్లలో రిజర్వేషన్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాలంటే, తప్పుకుండా మళ్లీ రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ప్రయాణీకులకు కాస్త వెసులుబాటు కల్పించింది. రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న టికెట్లను ఆన్ లైన్ లోనూ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
కౌంటర్ టికెట్ ఆన్‌లైన్ లో ఎలా క్యాన్సిల్ చేయాలంటే?
⦿ కౌంటర్ లో టికెట్ కొనుగోలు చేసిన వాళ్లు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
⦿ ఇందులో మీకు టికెట్ క్యాన్సిల్ ఆప్షన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
⦿ క్యాన్సిల్ ఆన్ లైన్ టికెట్, కౌంటర్ టికెట్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ సెక్యూరిటీ క్యాప్చా , PNR నెంబర్, రైలు నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ వివరాలు మీ కౌంటర్ టికెట్ మీద ఉంటాయి.
⦿ ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ వచ్చే ఓటీపీతో కన్ఫార్మ్ చేసుకోవాలి.
⦿ మీరు కౌంటర్ టికెట్ తీసుకున్నప్పుడు ఫామ్ లో ఏ నెంబర్ ఇస్తారో అదే నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
⦿ ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే బాక్స్ లో ప్రయాణీకుడి వివరాలను నిర్థారించుకోవాలి.
⦿ చివరిగా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కౌంటర్ టికెట్ క్యాన్సిల్ అవుతుంది.
⦿ లేదంటే 139 నెంబర్ కు కాల్ చేసి, మీ టికెట్ వివరాలను చెప్పి కౌంటర్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చు.
రీఫండ్ ఎలా తీసుకోవాలంటే?
కౌంటర్ టికెట్ ఆన్ లైన్ లో క్యాన్సిల్ చేసినప్పటికీ రీఫండ్ కోసం సమీపంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది. మీరు క్యాన్సిల్ చేసిన టికెట్ ను కౌంటర్ లో అందిస్తే మీకు రావాల్సిన రీఫండ్ ను ఇస్తారు. అయితే, రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే కౌంటర్ లో మీ టికెట్ అందించాల్సి ఉంటుంది. ఒకవేళ RAC లేదంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రైలు షెడ్యూల్ టైమ్ కు అరగంట ముందుకు వరకు ఇచ్చినా సరిపోతుంది. క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించుకుని మిగతా అమౌంట్ అందిస్తారు.
Read Also: థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు ఏ బెర్త్ బెస్ట్ అంటే?