varahi ammavaru: తాంత్రికులకు ఇష్టమైన దేవత. ఆమెకు రాత్రిళ్లే పూజలు జరుగుతాయి. పగలు ఆ అమ్మవారి గుడివైపు వెళ్లాలంటే భయంతో వణికిపోతారు. కానీ నమ్మిన భక్తులకు వరాలు ఇవ్వడంతో వారాహి మాత తర్వాతే ఎవరైనా అనేంతగా ప్రాచుర్యం. ఉగ్రదేవతలలో అత్యంత శక్తివంతమైన వారాహి మాత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
వారాహి మాత అత్యంత శక్తివంతమైన దేవత. ఈమె గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమెను శక్తి రూపాలలో ఒకరుగా చెప్తూ ఉంటారు. అంతే కాకుండా వారాహి మాతను సప్త మాత్రికలలో ఒకరిగా పూజిస్తూ ఉంటారు కూడా. అయితే వారాహి మాతను మాత్రుకలలో ఒకరిగా ఎందుకు పిలుస్తారు అంటే హిందూ పురాణాలలో ఆది పరాశక్తి అయిన దుర్గా అమ్మవారి నుంచి ఏడు శక్తి స్వరూపాలు ఉద్బవించాయి. వీళ్లను సప్త మాత్రుకలు అంటారు. అ సప్త మాత్రుకలలో ఒకరే వారాహిదేవి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రి సమయాలలో మాత్రమే పూజిస్తూ ఉంటారు. ఉదయం ఈ అమ్మవారి ఆలయాలు మూసి ఉంటాయి.
దేవీ భాగవతం ప్రకారం పురాణకాలంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తూ ఉండేవాడట. అప్పుడు దేవతలందరూ పార్వతిదేవి దగ్గరకు వెళ్లి వేడుకుంటారు. అప్పుడు పార్వతి దేవి.. ఉగ్రరూపంతో ఆది శక్తి అవతారం ఎత్తి రక్తబీజుడిని అంతం చేయడానికి వెళ్తుంది. కానీ రక్తబీజుడిని అంతం చేస్తున్నప్పునడు ఆ రాక్షసుడి రక్తపు చుక్కలు నేల మీద పడుతుంటే ఆ రక్తపు చుక్కల నుంచి రక్తబీజులు పుట్టుకొస్తుంటారు. వేల మంది రక్తబీజులు రావడంతో అమ్మవారికి అసాధ్యంగా మారిపోతుంది. అప్పుడు అమ్మవారు సప్తమాత్రుకలను సృష్టిస్తుంది. ఈ సప్తమాత్రుకలకు తాంత్రిక శక్తులు ఎక్కువగా ఉంటాయట. ఈ సప్త మాత్రుకలు ఎవరెవరంటే..? బ్రహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కైమారి, వారాహి, చాముండి. ఈ ఏడు అవతారాలలోని అమ్మవార్లు రక్తబీజుడిని చంపడానికి సహాయపడతారు.
ఈ భీకర యుద్దంలో వారాహి అమ్మవారు అత్యంత భయంకర రూపంతో సృష్టి మొత్తం ప్రతిధన్వించే శబ్దాలు చేస్తూ.. తన దంతాలతో అనేక మంది రక్తబీజులను అంతం చేస్తుంది. అసలైన రక్తబీజుడు దుర్గమ్మను ద్వంద యుద్దానికి పిలుస్తాడు. ఆ సమయంలో ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో కలిసిపోయి రక్తబీజుడిని అంతం చేసినట్టు దేవీ భాగవతంలో చెప్పబడింది. ఇలా జరిగిన తర్వాత హిరాణ్యక్షుడు అనే రాక్షసుడు.. అడ్డూ అదుపు లేకుండా భూదేవిని చిత్రహింసలు పెడుతుంటాడు. అయితే ఈ ఆకృత్యాలకు ముందే హిరాణ్యక్షుడు వారాహి మాత అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేస్తాడు. దీంతో అమ్మవారు ప్రత్యక్షమై.. ఏ వరం కావాలో కోరుకో అంటుంది.
అమ్మవారు అలా అడగ్గానే ఆ రాక్షసుడు వెంటనే నాకు అమరత్వం కావాలని అడుగుతాడు. దానికి వారాహి అమ్మవారు మాత్రం కుదరదని చెప్తుంది. అయితే నువ్వు తప్పా నన్ను ఎవ్వరూ చంపడానికి వీలులేదని అడుగుతాడు. అలాగే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా చంపొద్దని అడుగుతాడు. దానికి కూడా వారాహి మాత సరే అంటుంది. దీంతో వర బలంతో హిరాణ్యక్షుడు భూలోకంపై రెచ్చిపోతుంటే.. అప్పుడు హిరాణ్యక్షుడిని చంపడానికి వారాహి అమ్మవారిని నుంచి వరాహస్వామి ఉద్బవిస్తాడు. అలా వారాహి అమ్మవారి నుంచి వచ్చిన మహా విష్ణు అవతారమే వరాహ అవతారమని చెప్తుంటారు.
ఇక మత్య్స పురాణంలో శివుడి చెమటబొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అందకాసురుడు రాక్షసులందరికీ అధిపతి అయి దేవతల మీద యుద్దాన్ని మొదలు పెట్టి వారిని చిత్రహింసలు పెడతాడు. ఎలాగైనా ఈ అందకాసురుడి ఆకృత్యాలకు పులిస్టాప్ పెట్టాలని అందకాసురుడిని అంతమొందించేందుకు శివుడు పార్వతి దేవి లోని వారాహి అమ్మవారిని తలుచుకుంటాడని ఈ మత్స్య పురాణంలో చెప్పబడి ఉంటుంది.
ఇక వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అనుకుంటారు చాలా మంది కానీ అష్టబైరవులలో ఒకరైన ఉన్మత్తబైరవుడే ఈ వారాహి అమ్మవారి భర్త. వారాహి అమ్మవారి లాగే తను కూడా చాలా శక్తివంతమైన వాడు. నాలుగు చేతులు భయంకరమైన చూపులతో లక్ష సూర్యులు మండుతున్న అవతారం వలే కనిపిస్తు ఉంటాడు. అతని పేరులోని ఉన్మత్త అంటే ఉన్మాదం అని అర్తం. ఇది అతని భయంకరమైన ఉగ్రశక్తిని చూపిస్తుంది.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?