Credit Card Benefits: ప్రస్తుత డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు ప్రతి ఉద్యోగి జీవితంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగదు అవసరం లేకున్నా కూడా ఏదైనా కొనుగోలు చేయాలంటే చాలు క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డులను పరిమితికి మంచి ఉపయోగించడం, సకాలంలో చెల్లింపు చేయక పోవడం వంటి కారణాల వల్ల వినియోగదారులు అధిక వడ్డీ రేట్లను ఎదుర్కొంటారు. దీంతో అనేక మంది క్రెడిట్ కార్డులను భారంగా భావిస్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ వినియోగించడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం. ఈ లాభాలను తెలుసుకున్నాక, మీరు కూడా తప్పకుండా క్రెడిట్ కార్డ్‌ను సరిగ్గా వినియోగించాలనుకుంటారు.
1. అత్యవసర సమయాల్లో
అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. చేతిలో నగదు లేకున్నా కూడా క్రెడిట్ కార్డ్‌తో ఏ సమయంలోనైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఉదాహరణకు హాస్పిటల్ ఖర్చులు, ట్రావెల్ టికెట్‌లు, ఆన్‌లైన్ షాపింగ్, రెస్టారెంట్ బిల్లుల వంటివి.
2. EMI సౌకర్యం
పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు EMI (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఆ క్రమంలో రూ. 1,00,000 వరకు ఉన్న బిల్లులను EMI ద్వారా చెల్లించుకోవచ్చు. ఉదాహరణకు, మీరు రూ.50,000 విలువైన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, EMI సౌకర్యంతో తక్కువ వడ్డీ తో నెలకు రూ. 2,000 నుంచి రూ.5,000 వరకు చెల్లించుకోవచ్చు.
3. క్యాష్ బ్యాక్ (Cashback) ఆఫర్లు
క్రెడిట్ కార్డ్ ఉపయోగించడంలో ప్రధాన లాభాల్లో ఒకటి క్యాష్‌బ్యాక్ ఆఫర్స్. ఆన్‌లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్, రెస్టారెంట్, ఇంధన బిల్లుల చెల్లింపుల సమయంలో మీరు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి 5% నుంచి 20% వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.
4. రివార్డ్ పాయింట్లు (Reward Points)
క్రెడిట్ కార్డ్ వినియోగించేటప్పుడు రివార్డ్ పాయింట్లు పొందే ఛాన్సుంది. షాపింగ్, బిల్లులు చెల్లింపు, ఇంధన బిల్లులు, ట్రావెల్ బుకింగ్ వంటి వాటికి చెల్లింపులు చేసుకుంటే రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఈ రివార్డ్ పాయింట్లను మీరు తర్వాత షాపింగ్ లేదా క్యాష్‌బ్యాక్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, 1000 పాయింట్ల ద్వారా రూ.100 వచ్చే ఛాన్స్ ఉంటుంది.
Read Also: Best Deal: రూ. 5 వేలకే 64GB స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన డీల్‌ను మిస్ కావొద్దు..
5. క్రెడిట్ స్కోర్ పెరగడం
క్రెడిట్ కార్డ్ సరిగ్గా వినియోగించడం ద్వారా క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు. బిల్లులు సమయానికి చెల్లించడం, EMI లు ఆలస్యం చేయకుండా చెల్లింపు, క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 30% లోపే వినియోగించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ వల్ల లోన్ లేదా హౌసింగ్ లోన్ తీసుకోవడానికి మీకు అనుమతి లభిస్తుంది.
6. షాపింగ్ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, బ్రాండెడ్ స్టోర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. Amazon, Flipkart, Myntra లాంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకమైన డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రాండెడ్ స్టోర్లలో 5% – 30% వరకు డిస్కౌంట్లు లభిస్తాయి.
7. ట్రావెల్ ప్రయోజనాలు
ట్రావెల్ లవర్స్ కి క్రెడిట్ కార్డ్ బాగా ఉపయోగపడుతుంది. విమాన టికెట్‌ల పై డిస్కౌంట్, ఎయిర్‌లైన్స్ లాంజ్ యాక్సెస్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు, ట్రావెల్ క్రెడిట్ కార్డ్ ద్వారా విమాన ప్రయాణంలో 15% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది.
8. ఫ్యూయెల్ సర్దుబాటు (Fuel Surcharge Waiver)
ఫ్యూయెల్ కొనుగోలు చేయేటప్పుడు సర్దుబాటు ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఒక్కొక్క ఫ్యూయెల్ బిల్లు పై రూ. 10 – రూ.100 వరకు మినహాయింపు పొందవచ్చు. కొన్ని ప్రత్యేక కార్డులపై ఈ బెనిఫిట్ లభిస్తుంది.
9. భద్రత సహా అనేక ప్రయోజనాలు
క్రెడిట్ కార్డ్ వినియోగించడంలో భద్రత కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మిస్సింగ్ లేదా చోరీ జరిగినప్పుడు వెంటనే బ్లాక్ చేయించే అవకాశం ఉంటుంది. మీ ఖాతాను రక్షించేందుకు ఒటీపీ (OTP) సిస్టమ్ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్‌లకు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ చోరీ అయినా కూడా 24 గంటలలోపు రిపోర్ట్ చేస్తే మీరు నష్టపోకుండా ఉంటారు.