Tenth Exams: ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 1న పరీక్షలు ముగియనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.
6.15 లక్షల మంది హాజరు..
తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు మొత్తం 6.15 లక్షల మంది ఎగ్జామ్స్ కు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3450 ఎగ్జామ్స్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని విద్యా అధికారులు తెలిపారు. ఇప్పటికే పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని అధికారులు పేర్కొన్నారు.
ఈ పరీక్షలకు మాత్రం టైంలో మార్పులు..
అయితే, విద్యార్థులకు అధికారులు ముఖ్యమైన అంశాలను గమనించాలని చెప్పారు. ఫిజకల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. మిగిలిన పరీక్షలు అన్నీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
విద్యార్థులకు సీఎం కీలక సూచన:
రాష్ట్రంలో రేపు టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా (ఫేస్ బుక్) లోవిషెస్ తెలిపారు. టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న యంగ్ ఫ్రెండ్స్ కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. విద్యా ప్రయాణంలో టెన్త్ పరీక్షలు కీలక మైలురాయి అని చెప్పుకొచ్చారు. కష్టపడిన సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని సీఎం కీలక సూచనలు తెలిజయేశారు. విద్యార్థులు పెట్టుకున్న నమ్మకమే విజయాన్ని అందిస్తోందని వివరించారు. కష్టపడి చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయడు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు తెలిపారు.
ALSO READ: IIPE Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. ఏపీలో జాబ్స్.. నెలకు రూ.32,000 జీతం..