E-Paper
Advertisement

Plants for home: మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలా? అయితే ఈ మొక్కలను పెంచండి!

Plants for home: మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలా? అయితే ఈ మొక్కలను పెంచండి!
Advertisement

Plants for home: హిందూ సంప్రదాయంలోనూ.. వాస్తు శాస్త్రంలోనూ ప్రకృతికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మన ఇంటి పరిసరాల్లో పెంచే మొక్కలు కేవలం ప్రాణవాయువును ఇవ్వడమే కాకుండా.. ఇంటి లోపల ఉండే ప్రతికూల శక్తిని తొలగించి, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. సరైన దిశలో.. సరైన మొక్కను నాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం లభిస్తాయి. వాస్తు శాస్త్రం సూచించిన ఆ 7 మొక్కలు ఏంటి, వాటిని ఎక్కడ ఉంచాలి అనే విషయాలను  వివరంగా తెలుసుకుందాం.

1. తులసి :
మన ఇళ్లలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. దీనిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా.. ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా కాపాడుతుంది.

Advertisement

దిశ: తులసిని ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచాలి.

2. మనీ ప్లాంట్ :
పేరుకు తగ్గట్టుగానే.. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగి, సంపద పెరుగుతుందని నమ్మకం. ఇది ఇంటి లోపల పెంచే మొక్క. ఇది గాలిలోని కాలుష్య కారకాలను తొలగించి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది.

Advertisement

దిశ: దీనిని ఇంటికి ఆగ్నేయ మూలలో ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.

3. కలబంద :
కలబంద కేవలం చర్మ సౌందర్యానికే కాదు.. వాస్తు పరంగా కూడా చాలా గొప్పది. ఇది ఇంట్లో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది.అంతే కాకుండా మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దుష్ట శక్తులను పారద్రోలే శక్తి దీనికి ఉందని చెబుతారు.

దిశ: దీనిని తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచడం శుభప్రదం.

4. వెదురు మొక్క:
అదృష్టానికి మారుపేరు లక్కీ బాంబూ. చైనీస్ వాస్తు (ఫెంగ్ షుయ్), వాస్తు రెండింటిలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. ఇది శాంతి, అదృష్టానికి చిహ్నం. మూడు లేదా ఆరు కాండాలు ఉన్న వెదురు మొక్కను ఎంచుకోవడం మంచిది.

దిశ: దీనిని ఇంటికి తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచాలి.

5. జేడ్ ప్లాంట్:
జేడ్ ప్లాంట్ సంపదను ఆకర్షించే మొక్కగా పేరుగాంచింది. దీనిని ‘ఫ్రెండ్షిప్ ట్రీ’ అని కూడా పిలుస్తారు. దీని చిన్న ఆకులు నాణేల మాదిరిగా ఉండి, ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. వ్యాపారస్తులకు ఇది చాలా మంచిది.

దిశ: ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఆగ్నేయ దిశలో ఉంచితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

6. స్నేక్ ప్లాంట్ :
ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేసే అరుదైన మొక్క. ఇది గాలిలోని హానికరమైన రసాయనాలను పీల్చుకుని గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తుంది.

దిశ: దీనిని బెడ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో దక్షిణ లేదా పడమర దిశలో ఉంచవచ్చు.

7. శాంతి లిల్లీ :
పేరుకు తగ్గట్టే ఇది ఇంట్లో శాంతిని నెలకొల్పుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గించి, ప్రేమను పెంచుతుంది. ఇది చాలా అందమైన తెల్లని పువ్వులను ఇస్తుంది. ఇవి స్వచ్ఛతకు చిహ్నం.

దిశ: దీనిని ఇంట్లో ఎక్కడైనా ఉంచవచ్చు, కానీ బెడ్ రూమ్ లో ఉంచడం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు తొలగుతాయి.

గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు:
ఎండిపోయిన లేదా వాడిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలి.

క్యాక్టస్ (ముళ్ళ మొక్కలు) వంటి మొక్కలను ఇంటి లోపల పెంచకూడదు.

బోన్సాయ్ మొక్కలు పెంచకూడదు. ఎందుకంటే అవి ఎదుగుదల ఆగిపోయిన వాటికి సంకేతం.

మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోస్తూ.. వాటిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×