Vastu Tips: సనాతన ధర్మం ప్రకారం వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలను గురించి వివరించడం జరిగింది. ఈ పరిహారాలను అనుసరించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని అశుభకరమైన వస్తువులను చూడకుండా ఉండాలి . ఒక వేళ చూస్తే.. వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మరి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏయే వస్తువులు చూస్తే అశుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ?
ప్రతి వ్యక్తికి జీవితంలో కొన్నిసార్లు ఆనందం వస్తుంది. మరి కొన్నిసార్లు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని సార్లు రోజంతా కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాదు. ఇలాంటి సమయంలో వాస్తు శాస్త్రంలో వివరించబడిన చిట్కాలను ప్రయత్నించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే అశుభం కలిగించే వాటిని చూడకుండా ఉండాలి. వీటిని చూడటం వల్ల మనసులో నెగెటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట తిన్న , వండిన పాత్రలను శుభ్రం చేయండి. రాత్రిపూట గిన్నెలను అస్సలు వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి ఇంట్లో నివసించదని నమ్ముతారు. రాత్రిపూట వంట పాత్రలు శుభ్రం చేయకుండా ఉంటే మాత్రం వాటిని ఉదయం లేవగానే అస్సలు చూడకూడదు. ఇలా చేస్తే దరిద్రం వస్తుందని చెబుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం , ఇంట్లో మూసి లేదా విరిగిన గడియారాన్ని ఉంచడం మంచిది కాదు. ఉదయం లేవగానే అనుకోకుండా ఆగిపోయిన ,పాడైపోయిన గడియారాన్ని చూస్తే, ఈ కారణంగా మీరు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి అలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే తన నీడను గానీ, ఇతరుల నీడను గానీ చూడకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ తప్పు చేయడం ద్వారా పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది.
Also Read: సూర్యుడి సంచారం.. నవంబర్ 16 నుంచి ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్
ఉదయం ఏమి చేయాలి ?
సనాతన ధర్మంలో ఉదయం పూట దేవతలను పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుచేత ఉదయాన్నే స్నానం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత దేవతలను పూజించాలి. అలాగే స్వామికి ఇష్టమైన వస్తువులను సమర్పించాలి. దేవతలను స్మరిస్తూనే రోజును ప్రారంభించడం మంచిదని నమ్ముతారు. ఇది వ్యక్తి యొక్క జీవితాన్ని ఆనందపరుస్తుంది. అంతే కాకుండా అన్ని బాధలు, కష్టాల నుండి ఉపశమనం ఇస్తుంది. అంతే కాకుండా దేవాలయాలకు లేదా పేదలకు భక్తి ప్రకారం అన్నదానం, వస్త్రాలు, ఆహారాన్ని దానం చేయడం వల్ల ఫలితం ఉంటుంది.