Surya Gochar: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల రాజు అయిన సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుని యొక్క ఈ సంచారము లేదా రాశి మార్పు నవంబర్ 16న శనివారం ఉదయం 7:16 గంటలకు జరిగింది. ఇదిలా ఉంటే సూర్యుడి రాశి మార్పు మొత్తం 12 రాశులు ప్రభావితం చేస్తుంది.
ముఖ్యంగా ఈ ప్రభావం 4 రాశలపై ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి రాశి మార్పు 4 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ వ్యక్తులు జీవితంలో పెద్ద మార్పులను చూసే అవకాశం ఉంది. మరి సూర్యుడి సంచారం వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యే రాశులేవి వాటికి కలిగే ప్రయోజనాలు ఏవి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
సూర్యుడి రాశి మార్పు కర్కాటక రాశి వారి జీవితాల్లో పెను మార్పు తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతే కాకుండా మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. త్వరలోనే వ్యాపారంలో పెద్ద ఒప్పందాలను పొందుతారు. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. దీంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగార్థులకు ఇది మంచి సమయం. విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్లొనే అవకాశాలు కూడా ఉన్నాయి.
కన్యారాశి:
గ్రహాల రాజు సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించడం కన్యా రాశి వారికి శుభప్రదం కానుంది. ఫలితంగా కన్యా రాశి వారికి మతం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆఫీసుల్లో విజయం సాధించడం ప్రారంభిస్తారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి. అంతే కాకుండా భారీ లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. ఇదిలా ఉంటే పనిచేసే చోట ఉన్నతాధికారులు మీపై ప్రశంసలు కురిపిస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
వృశ్చికరాశి:
సూర్యుడు వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. అందుకే ఈ వృశ్చిక రాశి వారికి అధిక ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తారు. ఈ ప్రజల కష్టాలన్నిటికీ ముగింపు కూడా మొదలైంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అంతే కాకుండా కార్యాలయంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉన్నతాధికారులు మిమ్మల్ని అభినందిస్తారు.
Also Read: రాహువు- కేతువు సంచారం.. 2025లో ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయ్
కుంభరాశి:
కుంభ రాశి వారికి, సూర్యుడి రాశి మార్పు కెరీర్ పరంగా బాగానే ఉంటుంది. ఈ వ్యక్తులు త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ , ఇంక్రిమెంట్ పొందబోతున్నారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు త్వరలో అందుతాయి. విద్యార్థులు కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపార పరంగా లాభాలు పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్లొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.