Vastu Tips For Aquarium: వాస్తు ప్రకారం..ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.ఫిష్ అక్వేరియంలో రంగురంగుల చేపలను ఉంచడానికి చాలా మంది ఇష్టపడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఫిష్ అక్వేరియంలో ఏ చేపలను ఉంచాలో మీకు తెలుసా? చాలా మందికి ఈ విషయాలపై అవగాహన ఉండదు.
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇలా చేయకుంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. దీని వల్ల ఇంటి సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో కూడా ప్రస్తావించబడ్డాయి. వాస్తు ప్రకార్ మాత్రమే ఇంట్లోని వస్తువులను ఉంచినట్లయితే.. ప్రతికూల శక్తి పోయి, ఇంట్లో ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయి.
వాస్తు ప్రకారం, ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం మంచిది. మరి అక్వేరియం ఇంట్లో పెట్టేటప్పుడు ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలి. ఎన్ని చేపలు అక్వేరియంలో ఉంచాలి. అంతే కాకుండా ఏ ఏ రంగుల చేపలను అందులో పెంచాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతికూల శక్తులు దూరమవుతాయ్:
నిజానికి మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని తీసుకురాగల శక్తి చేపలకు ఉంటుంది. ఇవి అన్ని ప్రతికూల శక్తిని గ్రహించి మిమ్మల్ని రక్షిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో చేపల అక్వేరియం ఉంటే, అందులో 9 చేపలు ఉండాలి. ఒక నల్ల చేప, మరో ఎనిమిది బంగారు చేపలు ఉండాలి. బంగారు చేపలను శుభానికి చిహ్నంగా భావిస్తారు. ఇదే కాకుండా, వాస్తు శాస్త్రం ప్రకారం, అరోవానా చేప కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అరోవానా చేప ఇంట్లోకి ఆనందం, శ్రేయస్సు, సంపదతో పాటు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అరోవానా చేపలను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది.
Also Read: నవంబర్ 22 న కాలభైరవ పూజ చేస్తే.. నరదిష్టి మాయం
అరోవానా చేప విగ్రహం:
చాలా మంది ఇంట్లో అక్వేరియం ఉంచకూడదనుకుంటారు.అటువంటి పరిస్థితిలో మీరు అరోవానా చేపల విగ్రహాన్ని కూడా ఉంచుకోవచ్చు. అరోవానా చేప విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచండి. ఇది ఇంటికి ఆనందం , సంపదను కూడా తెస్తుంది. నోటిలో నాణెం ఉన్న అరోవానా చేప విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.