Mahabubnagar crime News: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. 108 అంబులెన్సులో ఆక్సిజన్ లేక బొజ్జయ్య అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామంలో జరిగింది. రైతు బొజ్జయ్య వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో.. కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వాహనంలో మహబూబ్‌నగర్ హాస్పటల్‌కు తరలిస్తుండగా ఆక్సీజన్ అయిపోవడంతో బొజ్జయ్య ఆయాస పడుతూ మార్గమధ్యలోనే చనిపోయాడు. దీంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆక్సిజన్ లేక మరణించిన వ్యవసాయ రైతూ..
అయితే బొజ్జయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో 108కు ఫోన్ చేయాగా.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అంబులెన్స్ లో ఆక్సిజన్ ఉందో.. లేదో.. చూసుకోకుండా రావడంతో బోజ్జయ్యను ఆసుపత్రిలో తీసుకెళుతుండగా మార్గమద్యమంలో ఆక్సిజన్ అయిపోయింది. దీంతో ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అక్కడే చనిపోయాడు. దీంతో అతని కుటంబ సభ్యులు అంబులెన్స్ డ్రైవర్ పై వాగ్వాదానికి దిగారు. ఇలా కావడానికి కారణం అంబులెన్స్ వారి నిర్లక్ష్యమే అని.. దీనికి పూర్తి కారణం వారే అని కుటుంబ సభ్యులు అతనిపై మండిపడుతున్నారు.
కుటుంబానికి తీరని శోకం..
అసలు ఎలా జరిగింది..? సిలిండర్ పని చేయలేదా లేదా అందులో ఆక్సిజన్ అయిపోయిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయినటువంటి బొజ్జలను కోల్పడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మొత్తంగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఎలా జరిగిందనే కోణంలో విచారణ ప్రారంభిస్తున్నారని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం
108 అంబులెన్స్ లో ఆక్సీజన్ లేక రైతు మృతి
మూసాపేట మండలం నిజలాపూర్ గ్రామానికి చెందిన రైతు బొజ్జయ్య
వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఛాతి నొప్పి రావడంతో అంబులెన్స్ కు ఫోన్
మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లో ఆక్సీజన్ అందక… pic.twitter.com/Q4FFN7zCU7
— BIG TV Breaking News (@bigtvtelugu) July 31, 2025
Also Read: అర్ధరాత్రి దారుణం.. ఆరేళ్ల బాలుడి గొంతుకోసి..
మరో ఘటన
ఒకే రోజు భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.ఈ ఘటన బాచుపల్లి పియస్ పరిదిలోని మిథులనగర్ చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాసులు, దుర్గారగినీ దంపతులు మిథిలానగర్, శాంతివనం అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ ఉండేవారు. గత కొన్ని రోజులుగా వారి మధ్య విభేదాలు తీవ్రంగా ఉండడంతో ఆత్మహత్యకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. భార్యాభర్తలిద్దరు సూసైడ్ చేసుకోవడంతో.. ఇద్దరు పిల్లలు ఆనాధలుగా మారారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.