Power Star Arrest: ఈమధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇలా భారీ మోసం చేసి ఇబ్బందుల్లో పడుతున్నారు. అందులో భాగంగానే “పవర్ స్టార్” గా పేరు సొంతం చేసుకున్న ఒక నటుడు ఇప్పుడు రూ.1000 కోట్ల డీల్ అంటూ ఏకంగా రూ.5 కోట్లు కొట్టేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న శ్రీనివాసన్ (Srinivasan) ను ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.
ఒక సంస్థ నుండి రూ.5 కోట్లు కొట్టేసిన పవర్ స్టార్..
పూర్తి వివరాల్లోకెళ్తే.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రముఖ హీరో శ్రీనివాసన్.. రూ.1000కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి ఒక సంస్థ నుంచి దాదాపు రూ.5 కోట్లు తీసుకున్నట్లు.. ఆర్థిక నేరాల విభాగం కింద జూలై 30 బుధవారం రోజు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.. తిరిగి తమ రుణం రాకపోవడంతో ఆ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైలో ఇతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
1000 కోట్ల రుణం ఇప్పిస్తానని భారీ మోసం..
ఇకపోతే పోలీసుల కథనం మేరకు.. ఒక కంపెనీకి రూ.1000 కోట్ల రుణం మొత్తాన్ని 30 రోజుల్లో ఇప్పిస్తానని పవర్ స్టార్ శ్రీనివాసన్ హామీ ఇచ్చారట. ఒకవేళ చెప్పిన సమయానికి డబ్బులు అందకపోతే.. తీసుకున్న రూ.5 కోట్లు కూడా తిరిగి ఇస్తానని వారికి చెప్పారట. అయితే ఆ డబ్బులను ఆ సినిమా నిర్మాణం అలాగే వ్యక్తిగత అవసరాల కోసం వాడుకొని తప్పించుకుంటున్నారు అని.. అటు నటుడు ఇచ్చిన హామీ మేరకు ఆ డబ్బు కూడా తమకు రాలేదు అని.. సదరు సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజాగా పోలీసులు తెలిపారు.
ఇప్పటికే 6 కేసుల్లో నిందితుడిగా పేరు నమోదు..
ఇకపోతే శ్రీనివాసన్ ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు అని , ఇప్పటికే ఆరు కేసుల్లో ఇరుక్కున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. శ్రీనివాసన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు చెన్నైలో ఒక ఫైనాన్స్ సంస్థను కూడా స్థాపించి , ఈ సంస్థ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇదివరకే కోర్టు రెండుసార్లు ఇతడిని “ప్రకటిత నేరస్తుడిగా” కూడా ప్రకటించింది . అయినా సరే 2018 నుండి విచారణకు హాజరు కాకుండా దూరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.. ఏది ఏమైనా పవర్ స్టార్ అనే బిరుదు తో ఇప్పుడు ఈ నటుడు ఇంత మోసాలకు పాల్పడుతూ ఉండడం చూసి ఇక్కడ టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . నిజానికి ఈ పవర్ స్టార్ అనే బిరుదును అతడే తగిలించుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీనివాసన్ సినీ జీవితం..
ఎవరీ శ్రీనివాసన్? ఆయన నటించిన సినిమాలు ఏంటి ?అనే విషయానికి వస్తే.. 2010లోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు . 2011లో లథిక అనే సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ఒకవైపు హీరోగా మరొకవైపు కమెడియన్ గా దాదాపు 60 కి పైగా చిత్రాలలో నటించిన ఈయన.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక హీరోగా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాసన్ ఇప్పుడు ఇలా మోసాల బారిన పడడం చూసి అందరూ విమర్శలు గుర్తిస్తున్నారు.
ALSO READ: War 2: వార్ 2 నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. “ఊపిరి ఊయలగా” అంటూ