Vastu Tips: ఇంటి చుట్టూ చెట్లు, మొక్కలు నాటడం వల్ల సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.
వాస్తు శాస్త్రంలో మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొన్ని రకాల మొక్కలు ఇంటికి సానుకూల శక్తిని , శ్రేయస్సును తెస్తాయి. ఇదిలా ఉంటే మరికొన్ని మొక్కలు ప్రతికూల శక్తిని ఉత్పత్తి కలుగజేస్తాయి. ఇంటి సభ్యుల మానసిక, శారీరక , ఆర్థిక సమస్యలను కారణం అయ్యే మొక్కలు కూడా ఉంటాయి. మరి వాస్తు ప్రకారం ఇంట్లో ఏ మొక్కలను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ముళ్ల మొక్కలు:
చాలా మంది ఇళ్లలో గులాబీ మొక్కలను పెంచుకుంటారు. కానీ వాస్తు ప్రకారం గులాబీ, కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో ఉంచడం అశుభం. ఇవి నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి. అంతే కాకుండా ఇంటి సభ్యుల మధ్య విభేదాలతో పాటు టెన్షన్‌లను కలిగిస్తాయి. మీరు కూడా గులాబీ మొక్కలను పెంచాలని అనుకుంటే.. ఇంటి లోపల కాకుండా ఇంటి ఆవరణలో పెంచుకోండి.
పాలను స్రవించే మొక్కలు:
తెల్లటి పాలతో కూడిన ద్రవాన్ని స్రవించే మొక్కలు ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. ఈ మొక్కలు ప్రతికూలతను వ్యాప్తి చేస్తాయి. అంతే కాకుండా ఇవి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.
ఎండిపోయిన మొక్కలు:
వాస్తు ప్రకారం ఇంట్లో ఎండిపోయిన మొక్కలను ఉంచడం వల్ల ప్రతికూల శక్తిని ఆకర్షించబడుతుందిజ అంతే కాకుండా ఇది ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఇంటి సభ్యుల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి మొక్కలను వెంటనే తొలగించాలి.
వెదురు మొక్క:
వెదురు మొక్కను వాస్తు శాస్త్రంలో శుభప్రదంగా పరిగణిస్తారు. కానీ దానిని సరైన దిశలో ఉంచడం తప్పనిసరి. వెదురు మొక్కను ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి. తప్పుడు దిశలో ఈ మొక్కను పెంచడం వల్ల ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతుంది. అంతే కాకుండా ఇది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.
బోన్సాయ్ మొక్కలు:
బోన్సాయ్ మొక్కలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వాటిని ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. ఈ మొక్కలు అభివృద్ధి, శ్రేయస్సులో అడ్డంకులను సృష్టిస్తాయి. అంతే కాకుండా ఆర్థిక పురోగతిని ఆపడానికి సంకేతంగా పరిగణించబడతాయి.
టాక్సిక్ ఎనర్జీ ఉన్న మొక్కలు:
రబ్బరు మొక్క లేదా స్నేక్ ప్లాంట్ వంటి కొన్ని మొక్కలు, టాక్సిక్ ఎనర్జీని కలిగి ఉన్నట్లు భావించడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ మొక్కలు చూడ్డానికి అందంగా ఉన్నప్పటికీ ఇంటి బయట ఉంచడం మంచిది.
Also Read: పంచమహాయోగం.. 5 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు
పెద్ద మొక్కలు (ఇంట్లో):
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి లోపల పెద్ద సైజు మొక్కలను ఉంచడం మానుకోవాలి. ఇది ఇంటి శక్తిని అడ్డుకుంటుంది. అంతే కాకుండా ఇంటి సభ్యుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెద్ద మొక్కలను ఎల్లప్పుడూ తోటలో లేదా బహిరంగ ప్రదేశంలో మాత్రమే నాటాలి. ఇంట్లో ఉండే కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆర్థిక, మానసిక పరిస్థితిపై ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటే టప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.