BigTV English

Triptii Dimri : నేచర్ లో ‘యానిమల్ బ్యూటీ’ సైక్లింగ్ కు నెటిజన్స్ ఫిదా

Triptii Dimri : నేచర్ లో ‘యానిమల్ బ్యూటీ’ సైక్లింగ్ కు నెటిజన్స్ ఫిదా

Triptii Dimri : తృప్తి డిమ్రి.. బాలీవుడ్ లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. నటించిన తక్కువ సినిమాలతోనే సొంత ఇమేజ్ ను క్రియోట్ చేసేసింది. ఇప్పటివరకూ కేవలం 8 సినిమాల్లో నటించిన ఈ భామ.. రణ్ బీర్ సరసన నటించిన యానిమల్ చిత్రంతో క్రెడిట్ కొట్టేసింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫోటోస్, వీడియోస్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ పంచుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా మరో వీడియోను షేర్ చేసింది. నేచర్ లో విహరిస్తూ తృప్తి డిమ్రి షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.


రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’ లో జోయా పాత్రలో కనిపించి యువ హృదయాలను కొల్లగొట్టిన నటి త్రిప్తి డిమ్రి. సోషల్ మీడియా వేదికగా ఈ భామ సరికొత్త వీడియోను పంచుకుంది. ప్రకృతిలో సైక్లింగ్ చేస్తూ స్వచ్ఛమైన గాలి పీల్చటం ఓ సరికొత్త అనుభూతి అంటూ చెప్పుకొస్తుంది. ఈ వీడియోలో నేచర్ లో విహరిస్తూ సైక్లింగ్ చేసేస్తుంది. కొండల్లో సైకిల్ పై విహరిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ద్రాక్ష పళ్ల తోటలతో పాటు పూల తోటల్లో విహరిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. పొల్యూషన్ కు దూరంగా తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోతుంది ఈ భామ. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : అఖండ2లో నాగసాధు పాత్రలో కల్కి నటి..!

తక్కువ సమయంలో గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిప్తి డిమ్రీ. 2017లో రిలీజైన పోస్టర్ బాయ్స్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తృప్తి.. ఇప్పటివరకూ 7 సినిమాల్లో నటించింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018) తో గుర్తింపు తెచ్చుకుంది. ఆపై అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022) సినిమాలతో ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకుంది. అయితే 2023లో రిలీజైన యానిమల్ చిత్రంలో రణ్ బీర్ సరసన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ భామ. గత ఏడాది ఈమె నటించిన మేరే మెహబూబ్ మేరే సనమ్ సినిమా లాంఛ్ అయింది.

ఈమె కెరీర్ ఆరంభంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నానని అవకాశాలు లేక కన్నీళ్లు పెట్టుకున్న రోజులు చాలానే ఉన్నాయి అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా తనకు బిగ్గెస్ట్ సక్సెస్ అందించిన యానిమల్ మూవీ తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమన్నారు. ఇక 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో తృప్తి డిమ్రి చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో సైతం 8వ స్థానంలో నిలిచింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×