BigTV English

Venus Transit 2024: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..!

Venus Transit 2024: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..!

Venus Transit in Ashlesha Nakshatra: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు తన గమనాన్ని జూలై 20న మార్చుకుంటాడు. ప్రస్తుతం శుక్రుడు ఆశ్లేష నక్షత్రం మీదుగా సంచరిస్తుండడంతో కొన్ని రాశుల వారు గొప్ప ప్రయోజనాలు పొందుతారు. పలు రాశులవారికి ఇది శుభప్రదం. అంతేకాకుండా వారి కెరీర్‌లో కూడా సంపదలు సృష్టించబడతాయి. మరికొన్ని రాశుల వారి కెరీర్‌లో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.


శుక్రుడు ఆనందం, శ్రేయస్సు, అందానికి బాధ్యత వహిస్తాడు. ఈ గ్రహం తన రాశి మార్చినప్పుడల్లా దాని శుభ, అశుభ పరిణామాలు మొత్తం 12 రాశులపై పడతాయి. జూలై 24, 2024 సోమవారం రోజు శుక్రుడు సాయంత్రం 6:10 గంటలకు ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ సంచారం మకర రాశి సహా ఐదు రాశుల జీవితాల్లో సానుకూల మార్పు కలిగిస్తుంది. ఆ ఐదు రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశి వారు శుక్రుడి సంచారం వల్ల శుభఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అదృష్టం కలసి వస్తుంది. ప్రతిపనిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు యొక్క ఈ నక్షత్ర మార్పు వల్ల మీరు వాహనం కొనుగోలు చేసి అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేస్తారు. మీ కెరీర్‌లో కొత్త అవకాశాలు పొందుతారు.


Also Read: మహాభారత యుద్ధంలో తండ్రిని మించిన తనయుడు.. వీరాధివీరులను సైతం ఓడించిన యోధుడెవరో తెలుసా?

సింహ రాశి:
శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశి వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. మీ గొప్ప కోరిక ఏదైనా సరే అది కూడా నెరవేరుతుంది. ఈ నక్షత్ర మార్పు వల్ల ఉద్యోగం, వ్యాపారం చేసే వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసే పనిలో ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. విదేశాల్లో చదవాలన్న మీ కల నెరవేరుతుంది.

మకర రాశి:
శుక్రుని సంచారం వల్ల మకర రాశి వారు అన్ని రంగాల్లో విజయాలు పొందుతారు.ఈ కాలంలో గొప్ప ఆర్థిక లాభం ఉంటుంది. వ్యాపారంలో భారీ విజయంతో పాటు ఆర్థిక లాభాలను పొందుతారు. అంతే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అపారమైన సంపదను పొందే అవకాశం ఉంది. మీరు చేసే పెట్టుబడి ఏదైనా భవిష్యత్తులో మీకు ప్రయోజనాన్ని అందిస్తుంది. జాతకంలో ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి.

Also Read: కుజుడిపై శని ప్రభావం.. జూలై 13 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్త !

తులా రాశి:
తులా రాశి వారు శుక్రుడి అనుగ్రహంతో సంతోషకరమైన జీవితాలను పొందుతారు. ఈ కాలంలో ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. దీంతో పాటు కెరీర్‌లోనూ ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడి లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆదాయం కూడా పెరుగుతుంది. ధనలాభం వల్ల కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ సమయం. ఉద్యోగస్తులు తమకు నచ్చిన ప్రదేశంలో ఉద్యోగాలు పొందుతారు.

మీన రాశి:
క్రీడలు, కళలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమకు నచ్చిన సంస్థల్లో ఉద్యోగం పొందుతారు. నిజాయితీగా శ్రద్ధగా పనిచేస్తే నెల రోజుల్లో పదోన్నతి కూడా పొందుతారు. బట్టలు, పాత్రల దుకాణాల్లో పనిచేసే వ్యక్తులు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వ్యాపారస్తుల పొదుపు కూడా పెరుగుతుంది.

Also Read: Shani-Jupiter Horoscope: శని, గురు గ్రహాల మార్పు.. వీరి జీవితంలో డబ్బు, సంతోషానికి కోదువ లేదు..

వృచ్చిక రాశి:
వ్యాపారం చేసేవారి దుకాణాల ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఇంటికి సంబంధించిన ఏదైనా కోర్టు విషయాలు నడుస్తుంటే వాటిలో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. ఆఫీసులో మీకు ఉన్నత అవకాశాలు ఉంటాయి. జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×