BigTV English

Karnataka Government on Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కబాబ్స్‌లో వాడే ఫుడ్ కలర్స్‌పై నిషేధం!

Karnataka Government on Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కబాబ్స్‌లో వాడే ఫుడ్ కలర్స్‌పై నిషేధం!

Karnataka Government Banned Food Color Using in Kebabs: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార పదార్థాల్లో వాడే ఫుడ్ కలర్స్ పై నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ముఖ్యంగా చికెన్ కు సంబంధించిన కబాబ్, ఫిష్ కబాబ్, వంటి రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం కేవలం ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపకుండా ఉండాలనే ఉద్ధేశ్యంతోనే చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.


ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటకలో ఫుడ్ స్టాల్స్ లో ఇటీవల సోదాలు ముమ్మరం చేశారు. ఎక్కడ చూసిన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారని వస్తున్న విమర్శల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకంపై ప్రజల నుంచి పలుమార్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు కబాబ్స్ నుంచి శాంపుల్స్ తీసుకుని టెస్ట్ కు పంపించారు.

Also Read: ఎమర్జెన్సీ నాటి ‘నస్బందీ’ ప్రచారానికి సంజయ్ గాంధీ ఎలా నాయకత్వం వహించారు?


టెస్ట్‌లో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం విపరీతంగా పెరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటకలో మంచురియాను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. పీచు మిఠాయి, మంచురియాలలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం పెరిగిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×