శుక్రుడిని శుభగ్రహంగా చెప్పుకుంటారు. ఎందుకంటే సంపదను, శ్రేయస్సును, భౌతిక సుఖాలను ఇచ్చేది శుక్రుడే. శుక్రుడు రాశి చక్రాన్ని మారినప్పుడల్లా కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. త్వరలో జూన్ 13న శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడే. అంటే శుక్రుడు తన సొంత నక్షత్రంలోనే సంచరించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభాలు కలుగుతాయి. ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి.
శుక్రుడి సొంత రాశి వృషభ రాశి. అంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు మరింత బలంగా, స్థిరంగా ఉంటాడు. ఈ ప్రస్తుతం శుక్రుడు వృషభరాశిలోనే ఉన్నాడు. త్వరలో వృషభరాశిలోనే భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అంటే సొంత రాశిలో, సొంత నక్షత్రంలో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీనివల్ల అనేక రంగాలలో ఉన్న కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారికి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. వ్యాపారంలోనూ, ఉద్యోగాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వసూలు అవుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. శుక్రుడు వల్ల లాభాలు పొందే ఐదు రాశుల వారు వీరే.
వృషభ రాశి
శుక్రుడి సొంత రాశి వృషభ రాశి. దీనివల్ల శుక్రుడి నక్షత్ర మార్పు అనేది ఈ రాశి వారికి అనేక రంగాలలో విజయాన్ని అందిస్తుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. అలాగే వ్యాపారం నుంచి కూడా లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం లో గొడవలు తగ్గుతాయి.
తులారాశి
ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఎన్నో శుభాల కలుగుతాయి. వ్యాపారంలో విజయం పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కూడా కనిపిస్తాయి. ఆర్థికంగా వృద్ధి జరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి డబ్బు చేతికి అందుతుంది.
సింహరాశి
సింహ రాశి వారికి కెరీర్ లో మంచి సానుకూలత కనిపిస్తుంది. వారికి కొత్తగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మికపరమైన కార్యకలాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. అలాగే ప్రమోషన్లు దక్కి అవకాశం కూడా ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి రాశి మార్పు అనేది ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది. వీరికి వ్యాపారం నుంచి అపారమైన ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అదే ఉద్యోగం చేసే వారికి అయితే ప్రమోషన్ లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక వైవాహిక జీవితంలో సంతోషం, మాధుర్యం కలుగుతుంది. తండ్రి నుంచి కూడా వారసత్వ ఆస్తులు వస్తాయి. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. మీ పెట్టుబడుల నుంచి రాబడి రావడం మొదలవుతుంది.
మీనం
మీన రాశి వారికి శుక్రుడి నక్షత్రం మార్పు ఎంతో ప్రత్యేకత అయినది. వీరికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీ అత్తమామల నుండి మీకు లాభాలు కలిగి అవకాశం ఉంది.