BigTV English

Raviteja: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న రవితేజ ‘వెంకీ’.. ఎప్పుడంటే?

Raviteja: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న రవితేజ ‘వెంకీ’.. ఎప్పుడంటే?

Raviteja: మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. చివరిగా చిరంజీవి (Chiranjeevi) తో కలిసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. కానీ సోలో హీరోగా విజయం చవిచూడలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే త్రినాధరావు నక్కిన (Trinadha Rao nakkina)దర్శకత్వంలో వచ్చిన ‘ధమాకా’ సినిమాతో చివరిగా సక్సెస్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు భాను భోగవరపు (Bhanu Bhogavarapu)దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.


రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న వెంకీ..

ఇకపోతే ఈ లోపు ఆయన సినిమాను రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు అభిమానులు. అందులో భాగంగానే రవితేజ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ‘వెంకీ’ కూడా ఒకటి. శ్రీను వైట్ల (Srinu vaitla) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం కాంబోలో వచ్చే సన్నివేశాలు సినిమాకి పెద్ద హైలెట్ అని చెప్పాలి. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అన్నట్టుగానే ఉంటుంది. ఇలా ఒక్కటేమిటి ఈ సినిమాలో ప్రతి అంశం కూడా ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. నేటికీ మీమ్స్ ద్వారా ట్రెండింగ్ లో ఉన్నాయి. దీంతో మరొకసారి థియేటర్లో విడుదల చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుంచో పట్టుబట్టిన విషయం తెలిసిందే.


జూన్ 14న థియేటర్లలో..

ఇక అందులో భాగంగానే అభిమానుల కోరిక తీర్చడానికి మేకర్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 2023లోనే ఈ సినిమాని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ సినిమాని కోరుకుంటున్న కారణంగా జూన్ 14వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈసారి 4K లో ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు చెప్పడంతో అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబయిపోతున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఇప్పటికీ ఈ పాటలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. మొత్తానికైతే మరో ఫుల్ మీల్స్ ప్రేక్షకులకు రాబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు.

వెంకీ సినిమా విశేషాలు..

వెంకీ సినిమా విశేషాల విషయానికి వస్తే.. 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన చిత్రం వెంకీ. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఏవీఎస్, శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు కమెడియన్స్ ఈ సినిమాలో తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా 2004 మార్చి 26న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అట్లూరి పూర్ణచంద్రరావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. స్టోరీ అందివ్వడం జరిగింది. మొత్తానికైతే అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2023 డిసెంబర్లో విడుదలైనప్పుడు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఫోర్ కే లో జూన్లో విడుదల కాబోతోంది. మరి ఇప్పుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ALSO READ:Naga Chaitanya: ప్రియమైన మరదలికి.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా చైతూ!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×