Karthika Deepotsavam Live: పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. శివయ్యను ఆరాధించే పవిత్రమైన దినాలను ప్రజలకు చేరువ చేసింది. కార్తీక మాసం అంటే పరమశివయ్యకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో నిశ్చలమైన భక్తితో శివయ్యను ఆరాధిస్తే కలిగే పుణ్యఫలం అంతా ఇంతా కాదు. అందుకే కాబోలు కార్తీక మాసంలో శివయ్య ఆరాధన కోసం భక్తులు శైవక్షేత్రాలకు భారీగా తరలివస్తారు.
కార్తీకమాసంలో ఓం నమః శివాయః అనే నామాన్ని జపిస్తే చాలు.. సర్వ పాపాలు హరిస్తాయన్నది భక్తుల విశ్వాసం. అంతటి పుణ్యఫలాన్ని ప్రసాదించే కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా నిర్వహించే కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని బిగ్ టీవీ విశ్వ దీపోత్సవం అనే పేరుతో ప్రత్యేక లైవ్ ద్వారా భక్తులకు చేరువ చేసింది.
మహబూబాబాద్ జిల్లాలోని పీఎస్సాఆర్ కన్వెన్షన్ హల్‌లో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 నుండి 9.00 గంటల వరకు జరిగే కార్తీకదీపోత్సవం వేడుకను కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని బిగ్ టీవీ, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
కార్తీక దీపోత్సవం కార్యక్రమం బిగ్ టీవీ ఆధ్వర్యంలో జయప్రదం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా దీపాల వెలుగులతో ప్రత్యేక అలంకరణ, కార్తీక మాస విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎంతో వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకలో 5 వేల మంది ఆడపడుచులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రవచనాలు, శ్వేతార్కగణపతి ఉత్సవ మూర్తులకు అభిషేకం, భద్రకాళి – భద్రేశ్వర కళ్యాణం, దీపోత్సవంను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తుండగా, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కోలాటం, క్లాసికల్ డాన్స్ ప్రదర్శనలు సైతం సాగుతున్నాయి.
Also Read; Weekly Horoscope Nov 3 to 9: ఈ వారమంతా మీకు ఎలా ఉండబోతుందంటే..?
కార్తీకమాసంలో కార్తీకదీపోత్సవం వంటి మహత్తర కార్యక్రమాన్ని సుదూర ప్రాంతాలలో ఉండే భక్తులు కూడా వీక్షించి, ఆ గరళ కంఠుని కృపా కటాక్షాలను పొందే అవకాశాన్ని లైవ్ ద్వారా బిగ్ టీవీ మీ ముందుకు తెచ్చింది. పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు సైతం బిగ్ టీవీ లైవ్ ద్వారా వీక్షించండి.. ఆ శివయ్య సేవలో తరించండి.