Akshaya Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొంటున్నారా..? ధనలక్ష్మీ మీ ఇంటికి వస్తుందని సంబరపడుతున్నారా..? వెలకట్టలేని సిరి సంపదలు మీ సొంతం అవుతాయని ఎగిరి గంతేస్తున్నారా..? అదంతా శుద్ద అబద్దం అంటున్నారు పండితులు. సంపదలు మూట కట్టుకోవడం అటుంచితే పాపం చేతికి అంటుకోక తప్పదంటున్నారు. అంతేనా ఇంకా శాపం బోనస్‌గా వస్తుందంటున్నారు. ఇంతకీ ఏంటా పాపం.. ఏంటా శాపం.. అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి..? పండితులు ఏం చెప్తున్నారు..? ఈ కథనంలో తెలుసుకుందాం.
అక్షయ తృతీయ ఈ పేరు వింటే చాలు గోల్డ్ రేటు అమాంతం పెరిగిపోతుంది. పుత్తడి అమ్మకాలు టాప్‌లోకి వెళ్లిపోతాయి. బంగారం షాపులు కొనుగోళ్లతో కొత్త కళను సంతరించుకుంటాయి. అమ్మే వాళ్ల జేబుల నిండా డబ్బులు చేరిపోతాయి. కొనే వారికి మాత్రం అకౌంట్లన్నీ నిల్లవుతాయి. తృణమో పణమో పెట్టి కాసింత స్వర్ణం కొందామనుకునే వాళ్లు కొందరైతే.. అప్పో సప్పో చేసైనా బంగారం కొనాలనుకునే వాళ్లు మరి కొందరు. అలా ఉంటుంది అక్షమ తృతీయ మహిమ. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ జాడ్యం అంతకంతకు పెరుగుతూ వస్తుందని పండితులు సెలవిస్తున్నారు.
అక్షయ తృతీయ నాడు గోల్డ్ కొనకూడదా..?
అక్షమ తృతీయ నాడు గోల్డ్ కొనకూడదని చెప్తున్నారు పండితులు. అందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. అందులో ముఖ్య మైనది.. కలి పాపం అంటుకోవడం. అవును మీరు చదువుతున్నది నిజమే..? ద్వాపర యుగం అయిపోతుంటే.. బ్రహ్మదేవుడు కలి పురుషుడిని పిలిచి ఇక నీ యుగం ప్రారంభం కాబోతుంది. వెళ్లి నీ ఇష్టారాజ్యంగా పాలించుకో అని చెప్పారట. అప్పుడు కలి పురుషుడు, బ్రహ్మదేవుడితో స్వామి భూలోకంలో ప్రజలంతా నిష్టాగరిష్టులై ఉన్నారు. నేను వెళ్లి వాళ్లను ఎలా అంటుకోగలను.. పైగా అక్కడ ఇంకా విష్ణుదేవుడు కృష్ణావతారంలో ఉన్నారని చెప్పగానే.. త్వరలోనే కృష్ణావతారం ముగియనుందని ద్వాపర యుగం అయిపోతుందని ఇక వచ్చేదంతా కలియుగమేనని చెప్తాడట.
అలాగే కలియుగంలో ప్రజలందరూ కోర్కెలనే గుర్రాల మీద పరుగెడుతుంటారని అటువంటి వారినే నువ్వు ఆవహించవచ్చు అని చెప్పాడట. అయితే కలి పురుషుడు అనుమానం వచ్చి ఏఏ కోర్కెలు వెంట పరుగెత్తే వాళ్లను పట్టుకోవాలో మీరే తెలపండి స్వామి అని అడగ్గా.. బంగారంపై వ్యామోహం, స్త్రీ లోలత్వం, మద్యం, అబద్దం, స్వార్థం, నేరపూరితం లాంటి చెడు కర్మలు చేసే వాళ్లను ఏమైనా చేసుకో అని చెప్పాడట. దీంతో ఇక కలి వెంటనే వచ్చి భూలోకంలో విచ్చలవిడిగా ఉన్న వ్యక్తులను టార్గెల్ చేయడం మొదలుపెట్టాడట. అందుకే బంగారంపై వ్యామోహంతో పరుగెడితే కలిపాపం అంటుకుంటుందని అది చెడు కర్మలను చేసేలా ప్రేరేపిస్తుందని పండితులు చెప్తున్నారు. అదీ అతి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా బంగారం కొనడం అనేది ఇంకా పాపం మూట కట్టుకోవడమే అంటున్నారు.
అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి..?
అతి పవిత్రమైన అక్షమ తృతీయ రోజు సముద్ర స్నానం చేయాలి. అది కుదరకపోతే నదీ స్నానం చేయాలి. అది కుదరకపోతే కనీసం చెరువులోనో సరస్సులోనో ఆలయాల దగ్గర ఉండే కొలనులో స్నానం చేయాలి. దైవదర్శనం చేసుకోవాలి. పితృ దేవతలను స్మరించుకోవాలి. వారి పేరు మీద తృణమో పణమో దానం ఇవ్వాలి. సత్కకర్మలు చేయాలి. ఏమీ కుదరకపోతే శుచిగా ఇంటి దగ్గర స్నానం చేసి దేవుడిని పూజించుకోవాలి. అని పండితులు చెప్తున్నారు.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు