Nandamuri Balakrishna: ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రకటన జరిగింది. తెలుగు ఇండస్ట్రీ నుండి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ దక్కింది. దీంతో ఫ్యాన్స్ అంతా తెగ హ్యాపీగా ఫీలయ్యారు. నందమూరి కుటుంబం నుండి ఎన్‌టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఆ తర్వాత ప్రేక్షకులకు అభిమాన బాలయ్యగా మారిపోయారు. కెరీర్ మొదటి నుండి డిఫరెంట్ కథలతో, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ మాస్ కమర్షియల్ హీరోగా ఎదిగారు బాలయ్య. అలాంటి సీనియర్ హీరోకు పద్మభూషణ్ అందడం సంతోషకరమని సోషల్ మీడియా అంతా విషెస్ చెప్తున్నారు. ఆయన ఈ అవార్డ్ అందుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్ హ్యాపీ
భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డ్ అందుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు. దీనిని తెగ షేర్ చేసేస్తున్నారు కూడా. ఈ నందమూరి హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు మాస్ కమర్షియల్ హీరో అంటే బాలయ్య పేరే చెప్పేవాళ్లు. ఆయన సినిమాల్లో చేసిన కొన్ని సీన్స్, చెప్పిన కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులపై చాలానే ఇంపాక్ట్ చూపించాయి. అలాంటి సీన్స్‌ను వేరే హీరోలు చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేవాళ్లు కాదేమో. కానీ అది బాలయ్య కాబట్టి ఆడియన్స్ వాటిని యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారు.
కుటుంబంతో సహా
పద్మభూషణ్ (Padma Bhushan) అవార్డ్ అందుకోవడం కోసం సకుటుంబంతో ఢిల్లీకి వెళ్లారు బాలకృష్ణ. అక్కడ ఆయన పంచకట్టుతో తండ్రిని తలపించే లుక్‌లో ఉన్నారని అభిమానులు అనుకుంటున్నారు. తండ్రి, భార్య, కూతురితో పాటు నారా లోకేశ్ కూడా బాలయ్య పద్మ భూషణ్ అందుకోవడానికి కళ్లారా చూడడం కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ బాలయ్య ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఇన్నేళ్ల నుండి సినీ పరిశ్రమకు హీరోగా ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నందుకు బాలయ్యకు పద్మభూషణ్ రావడం సంతోషకరం అని ఇండస్ట్రీ నిపుణులు సైతం ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా పద్మ భూషణ్ బాలయ్య అనే హ్యాష్ ట్యాగ్‌తో వైరల్ అవుతోంది.
Also Read: ఓటీటీల్లో అడల్ట్ సీన్స్.. కేంద్రంపై సుప్రీం సీరియస్.. సమాధానం చెప్పాల్సిందే అంటూ..
లైవ్ స్ట్రీమింగ్
బాలకృష్ణ (Balakrishna)తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు కూడా పద్మ భూషణ్ అవార్డ్ దక్కింది. ఆయన కూడా తన కుటుంబ సభ్యులతో ఈ అవార్డ్ అందుకోవడానికి హాజరయ్యారు. వీరిద్దరితో పాటు యాక్టర్ అనంత్ నాగ్‌కు కూడా పద్మ భూషణ్ దక్కింది. అలాగే పద్మ శ్రీ అందుకున్న వారి లిస్ట్‌లో కూడా పలువురు యాక్టర్లు ఉన్నారు. పంకజ్ ఉధాస్ అనే సింగర్‌కు మరణించిన తర్వాత పద్మ భూషణ్ దక్కింది. యూట్యూబ్‌లో ఈ అవార్డుల వేడుక లైవ్‌గా స్ట్రీమ్ అవుతోంది. దీంతో హీరోల అభిమానులను దానిని చూసుకుంటూ, వీడియోలు రికార్డ్ చేస్తూ, స్క్రీన్‌షాట్స్ తీస్తూ సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోలు సైతం ఈ అవార్డులు అందుకోవడంలో సంతోషం వ్యక్తం చేశారు.