Hanuman Jayanti 2025: ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీ శనివారం జరుపుకోనున్నాము. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. అంతే కాకుండా అప్పుల బాధలు తొలగిపోతాయని, గ్రహాల దుష్ప్రభావాల నుండి కూడా ఉపశమనం పొందుతామని నమ్ముతారు. ఇంతకీ హనుమాన్ జయంతి రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చైత్ర మాసంలో వచ్చే.. హనుమాన్ జయంతిని రోజున.. దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ దేవాలయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున హనుమంతుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీనితో పాటు.. ఈ రోజున వివిధ ప్రదేశాలలో దేవాలయాలలో ప్రత్యేక పూజలు, ర్యాలీలు కూడా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే.. శనివారం రోజు అంటే హనుమంతుడిని నిత్య పూజించే రోజున పండగ వచ్చింది.
మత విశ్వాసాల ప్రకారం.. హనుమాన్ జయంతి రోజున స్వామిని పూజించడం ద్వారా.. అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోతాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరతాయి. అంతే కాకుండా హనుమాన్ జయంతి రోజున కొన్ని ప్రత్యేకమయిన పూజలు చేయడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది. మీరు కష్టాల నుండి కూడా బయట పడటానికి ఎక్కువగా అవకాశాలు కూడా ఉన్నాయి.
హనుమాన్ జయంతి రోజు రాత్రి ఇలా చేయండి:
1. హనుమాన్ జయంతి రోజు రాత్రి.. గంగా నీటితో స్నానం చేసి.. ఆ తర్వాత చంద్రుడిని పూజించండి. చంద్రునికి నీటిని సమర్పించండి. గ్రహాల శాంతి కోసం మంత్రాలను కూడా జపించండి. హనుమాన్ జయంతి రోజున ఈ పరిహారం చేయడం ద్వారా.. మీ జాతకంలో గ్రహాల బలహీన స్థానం కూడా బలపడుతుంది.
2. అప్పుల బాధ నుండి బయటపడటానికి.. హనుమాన్ జయంతి రాత్రి లక్ష్మీ దేవిని పూజించండి. ఈ పూజ సమయంలో నెయ్యి దీపం వెలిగించండి. అలాగే.. శ్రీ లక్ష్మీ సూక్తాన్ని పఠించండి. హనుమాన్ జయంతి రోజున చేసే ఈ పరిహారం లక్ష్మీ దేవి ఆశీస్సులతో మీకు రుణ విముక్తులను చేస్తుంది.
Also Read: పూజ గది ఏ దిక్కున ఉంటే అదృష్టమో తెలుసా ?
3. హనుమాన్ జయంతి రాత్రి హనుమంతుడిని భక్తితో పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ పూజ సమయంలో, హనుమాన్ చాలీసా పఠించి, స్వామికి నైవేద్యాన్ని సమర్పించండి. అలాగే మీ కోరికను దేవునికి 3 నుండి 5 సార్లు నిశ్శబ్దంగా చెప్పండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు హనుమంతుడు తప్పకుండా తీరుస్తాడు.