BigTV English

Chitti Pickles Ramya: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా.. అసలు విషయం చెప్పిన చిట్టి పికెల్స్ రమ్య!

Chitti Pickles Ramya: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా.. అసలు విషయం చెప్పిన చిట్టి పికెల్స్ రమ్య!

Alekhya Chitti Pickles Controversy: గత కొద్ది రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పికెల్స్ ధర ఎక్కువగా ఉందన్న కస్టమర్స్ తో అలేఖ్య చిట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం సంచలనం కలిగించింది. ఆమె తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిట్టి పికెల్స్ సిస్టర్స్ పై నెటిజన్లు, మీమర్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. ఇన్ స్టా, ఎక్స్, ఫేస్ బుక్ ఎక్కడ చూసినా వీరిపైనే ట్రోల్స్, మీమ్స్ కనిపించాయి. ఏకంగా పికెల్స్ వ్యాపారం పూర్తిగా క్లోజ్ అయ్యింది. ఆ తర్వాత అలేఖ్య డిప్రెషన్ కు గురై హాస్పిటల్లో పడినట్లు వాళ్ల సిస్టర్స్ రమ్య, సుమ వెల్లడించారు. తమ సిస్టర్ చేసింది తప్పేనని, దయచేసి క్షమించాలని ముగ్గురు సారీ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఈ వివాదం సర్దుమణుగుతోంది.


బెట్టింగ్ యాన్స్ ప్రమోషన్స్ గురించి రమ్య క్లారిటీ

ఇక అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంలోకి ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అలేఖ్య సిస్టర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని, అందుకే శిక్ష భగవంతుడు వేశాడని చెప్పుకొచ్చాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన సంపాదనతోనే వాళ్లు పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టారన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన లేవనెత్తిన అంశంపై రమ్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, సంపాదించిన డబ్బుల గురించి క్లారిటీ ఇచ్చింది.


బెట్టింగ్ యాప్స్ తో ఎంత సంపాదించానంటే?

చాలా మంది తనను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని అప్రోచ్ అయ్యారని, ఎంతో మందిని రిజెక్ట్ చేశానని రమ్య చెప్పుకొచ్చింది. చాలా మంది ఇన్ ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో మీడియేటర్లుగా ఉంటారని వివరించింది.  “చాలా మంది నన్ను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని కోరారు. నేను చాలా వరకు రిజెక్ట్ చేశాను. నాకు పరిచయం ఉన్న అమ్మాయి చెప్పడంతో ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను. దానికి నాకు వాళ్లు 4,800 రూపాయలు ఇచ్చారు. అది కూడా ఎంతో బేరం ఆడిన తర్వాత ఇచ్చారు. ఈ యాప్ ప్రమోషన్ వీడియోను అన్వేష్ అన్నయ్య చూశాడు. ఈ ప్రమోషన్స్ వల్ల ఎంతో మంది బలవుతారని చెప్పాడు. నేను వెంటనే డిలీట్ చేశాను. చాలా మంది ఎందుకు డిలీట్ చేశావు? అని అడిగారు. కావాలంటే మీ డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను ఎలాంటి యాప్స్ ప్రమోట్ చేయలేదు” అని రమ్య వివరించింది.

Read Also: పచ్చళ్ళ బిజినెస్ క్లోజ్.. అలేఖ్య చిట్టి కొత్త వ్యాపారం ఇదే!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు వ్యతిరేకంగా అన్వేష్ చేస్తున్న పోరాటం చాలా గొప్పగా ఉందని రమ్య ప్రశంసించింది. ఆయనకు అందరూ మద్దతు పలకాల్సి అవసరం ఉందని చెప్పుకొచ్చింది. ఈ యాప్స్ మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మానుకోవాలని ఇన్ ఫ్లూయెన్సర్స్ కు సూచించింది.

Read Also: మా మతంతో మీకేంటి పని? వాళ్లకు క్లాస్ పీకిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య!

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×