Mangal Gochar 2025: కుజుడిని ధైర్యం, శౌర్యం, రక్తం, భూమి, యుద్ధాన్ని సూచించే గ్రహంగా చెబుతారు. ఏప్రిల్ 03న కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించాడు. జూన్ 07 వరకు కుజుడు ఈ రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిని కుజుడు నీచ రాశిగా పరిగణిస్తారు.
కుజుడు నీచ రాశిలోకి ప్రవేశించినప్పుడు.. అది 12 రాశుల వ్యక్తులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కుజుడి ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి:
కర్కాటక రాశిలో కుజుడి సంచారం చాలా శుభప్రదంగా, సానుకూలంగా ఉంటుంది. కన్యా రాశిలో.. కుజుడు పదకొండవ ఇంట్లో సంచరించనున్నాడు. మీ జాతకంలో 11వ ఇల్లు ఆదాయానికి, కోరికల నెరవేరడానికి సూచికగా పరిగణించబడుతుంది. ఇలాంటి సమయంలో మీ కోరికలన్నీ నెర వేరతాయి. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. అంతే కాకుండా ఈ సమయం ఇల్లు, భూమి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్న వారికి మంచి సమయం. మీరు ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో.. మీరు చిక్కుకున్న డబ్బును కూడా తిరిగి పొందుతారు. అంతే కాకుండా మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగిపోతుంది. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి.
తులా రాశి:
కుజుడి సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కర్మ ఇంట్లో కుజుడు సంచారము చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కొత్త ఉద్యోగాలకు మంచి ఆఫర్లను పొందుతారు. అంతే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ కెరీర్‌లో కొత్త ఎత్తుకు ఎదిగే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు లభిస్తాయి. మీరు డబ్బు సంపాదించడానికి ఒక కొత్త అవకాశాన్ని పొందుతారు. కానీ లావాదేవీల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా మీరు పెట్టుబడుల నుండి కూడా అనేక లాభాలు పొందుతారు . కొత్త పెట్టుబడులకు కూడా ఇది చాలా మంచి సమయం . కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆఫీసుల్లో అధికారుల నుండి కూడా మీరు మద్దతు పొందుతారు.
Also Read: అయోధ్యలో శ్రీరాముడికి సూర్య తిలకం.. ఎప్పుడు, ఎన్ని గంటలకు లైవ్‌లో చూడొచ్చంటే?
మీన రాశి:
కర్కాటక రాశిలో కుజుడు సంచరించడం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రాశి నుండి ఐదవ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి. అంతే కాకుండా మీ పిల్లల పురోగతికి కూడా ఇది చాలా మంచి సమయం అని గుర్తించండి. ఈ సమయంలో మీరు శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితి కూడా ముందటి కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశాలు లభిస్తాయి.