Big Tv Originals: వ్యాపారం చేసేవాళ్లు కస్టమర్లను దేవుళ్లుగా చూడాలి. వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాలి. అంతేగానీ.. వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టకూడదు. అయితే, ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నవారంతా పతీతులు అని చెప్పలేం. ఎందుకంటే.. ఒకరకంగా వాళ్లు కూడా ఆమె చేస్తున్న తప్పే చేస్తున్నారు. ఎందుకంటే.. ఏ వ్యక్తి.. మరో వ్యక్తిని కించపరచకూడదు. దూషించకూడదు. అది చట్టపరంగా నేరం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది మరింత శిక్షార్హమైనది. ఎందుకంటే.. ఇందులో సాక్ష్యాలు కూడా ఉంటాయి. కాబట్టి.. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఇతరులకు కామెంట్లు పెట్టేప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. నోరు జారితే జైలుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఉంటే?
ఒక వేళ.. అలేఖ్యతో తిట్ల తిన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఉంటే.. ఆమె చిక్కుల్లో పడుతుంది. ఎందుకంటే.. ఆమె దూషించింది అతడిని మాత్రమే కాదు.. అతడి తల్లిని కూడా. ఒక మహిళ.. తోటి మహిళను అంత మాట అనడం ఘోరాతి ఘోరం. ఆమె మాటలకు ఆ వ్యక్తి బాధపడి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోల్స్ మాత్రమే వస్తున్నాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఉంటే అలేఖ్య జైలుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. అసలు.. ఇలాంటి దూషణలపై మన చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎలాంటి శిక్ష విధిస్తుంది? తదితర విషయాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యలు చేస్తే ఏం జరుగుతుంది?
సోషల్ మీడియా అనేది ప్రజలు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకునే వేదిక మాత్రమే. ఒకవేళ ఆయా ప్లాట్ ఫారమ్ లలో ఇతరులను దూషించడం, కించపరచడం లాంటివి చేస్తే చట్ట ప్రకారం శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో.. ఇప్పుడు చూద్దాం..
⦿ పరువు నష్టం: ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే, సదరు వ్యక్తిపై పరువునష్టం దావా వేసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో 2 ఏండ్ల పాటు జైలు శిక్ష, లేదంటే జరిమానా వేస్తారు. కొన్నిసార్లు రెండూ విధించే అవకాశం ఉంటుంది.
⦿ ఇతరులను రెచ్చగొట్టడం: సోషల్ మీడియా వేదికగా ఇతరులను రెచ్చగొట్టేలా బూతులను ఉపయోగించడం, గొడవకు కారణం అయ్యేలా వ్యవహరించడం కూడా నేరమే అవుతుంది. ఈ కేసులో 2 సంవత్సరాల వరకు జైలు, జరిమానా వేస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంటుంది.
⦿ లైంగిక వేధింపులు: ఆన్ లైన్ వేదికగా అనుచిత సందేశాలను పంపించడం లైంగిక వేధింపుల కిందికే వస్తుంది. ఈ కేసులో ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా పడుతుంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు.
⦿ స్త్రీలను అగౌరవపరచడం: స్త్రీల గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం కూడా తీవ్రమైన నేరంగానే పరిగణిస్తారు. ఈ కేసులో 3 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
⦿ అశ్లీల కంటెంట్‌ను పోస్ట్ చేయడం: సోషల్ మీడియాలో అశ్లీలమైన జోకులు, ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం నేరం. ఈ కేసులో మొదటిసారి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
⦿ లైంగిక కంటెంట్‌ను షేర్ చేయడం: లైంగిక సంబంధ అసభ్యకరమైన వీడియోలను, ఫోటోలను షేర్ చేయడం పెద్ద నేరంగా పరిగణిస్తారు. 5 ఏండ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
⦿ బెదిరింపులకు పాల్పడటం: ఎవరైనా వ్యక్తులు నకిలీ అకౌంట్ల ద్వారా ఇతరులను భయపెట్టడం, బెదిరించడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఈ కేసులో 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. .
సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చు. కానీ, ఎదుటి వారిని కించపరిచేలా వ్యవహరించకూడదు. ఇక ఎట్టకేలకు అలేఖ్య స్పందించింది. సారీ కూడా చెప్పింది. చేసిన తప్పుకు పశ్చాతాపం చెందింది. దీనికి మించిన పెద్ద శిక్ష మరొకటి ఉండదు. మరి సోషల్ మీడియా ఇంతటితో ట్రోలింగ్స్ ఆపేసి.. ఆమె పనిని ఆమెను చేసుకోనిస్తుందో లేదో చూడాలి.
Read Also: 30 సెకన్లు తిట్టి.. 7 సెకన్ల వీడియో రిలీజ్ చేసిన అలేఖ్య చిట్టీ.. క్షమిస్తారా?