Big Stories

T20 Match : వెల్లింగ్టన్ వేదికగా భారత్-కివీస్ తొలి టీ20 .. కుర్రాళ్లు సత్తా చాటుతారా?

Share this post with your friends

T20 Match : న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ కు సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. ఈ ముగ్గురు సీనియర్లను ఈ టూర్ కు ఎంపిక చేయలేదు. సెలెక్టర్లు వారికి విశ్రాంతినిచ్చారు.

హార్దిక్‌ పాండ్య సారథ్యంలో భారత్ జట్టు కివీస్ టూర్ లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇప్పటికే వన్డేల్లో సత్తా చాటిన శుభ్‌మన్‌ గిల్ .. టీ20ల్లో అరంగేట్రం చేయడం లాంఛనమే. గిల్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే ఛాన్స్ ఉంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్ పంత్‌ ఉంటారు. శ్రేయస్‌ అయ్యర్ , సంజు శాంసన్ , దీపక్ హుడాలో ఒకరిద్దరికి జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు సత్తా చాటేందుకు అవకాశం దక్కింది.

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ బౌలర్ల సరిగ్గా రాణించలేదు. బుమ్రా లేని లోటు కనిపించింది. కివీస్ తో సిరీస్ లోనూ మళ్లీ భారత బౌలర్లు కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి. టీ20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన హర్షల్‌ పటేల్‌ కు ఈ సిరీస్‌లో అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లు‌ చాహల్‌,‌ కుల్‌దీప్‌ యాదవ్ జట్టులో ఉన్నారు. వాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. రెగ్యులర్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారత్‌ జట్టుకు తాత్కాలికంగా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

న్యూజిలాండ్‌ కూడా భారత్‌ లాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. టీమిండియాలాగే ఆ జట్టూ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓడింది. సొంతగడ్డలో విలియమ్సన్‌ సేనను అడ్డుకోవడం భారత్‌కు అంత తేలికేం కాదు. గప్తిల్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో కాన్వేతో కలిసి అలెన్‌ ఫిన్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి వైదొలిగిన పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచకప్‌లో తన స్ట్రైక్‌రేట్‌పై వచ్చిన విమర్శలకు విలియమ్సన్‌ ఎలా జవాబు చెబుతాడో చూడాలి.

జట్లు (అంచనా)

భారత్‌: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌/సంజు శాంసన్‌/దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షల్‌ పటేల్‌/ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, కాన్వే, ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, ఇష్‌ సోథీ, ఆడమ్‌ మిల్నె, ఫెర్గూసన్‌

కివీస్‌లో మైదానాల్లో పరుగుల వరదపారడం ఖాయం. కానీ తొలి టీ20 మ్యాచ్ జరిగే వెల్లింగ్టన్ పిచ్ ‌ మాత్రం ఇందుకు భిన్నం గా ఉంది. ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటు స్కోరు 162 పరుగులే. వెల్లింగ్టన్‌లో చలి గాలులతో కూడిన వాతావరణం ఉంది. చివరిసారి న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా టీ20 సిరీస్‌ను 5-0తో సొంతం చేసుకుంది. ఈ సారి కుర్రాళ్లు సత్తాచాటి కివీస్ ను వణికిస్తారో లేదో చూడాలిమరి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News