BigTV English

Kumbh mela 2025: కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు నిర్వహిస్తారు ?

Kumbh mela 2025: కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు నిర్వహిస్తారు ?

Kumbh mela 2025:  ప్రతి 12 సంవత్సరాల తర్వాత మాత్రమే మహా కుంభమేళా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? వాస్తవానికి, ఈ జాతర నిర్వహణ వెనుక లోతైన పౌరాణిక విశ్వాసాలు , సంప్రదాయాలు ఉన్నాయి. దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


12 ఏళ్ల తర్వాత మాత్రమే మహా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు ?
కుంభమేళాను భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన మత , సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిస్తారు. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని తో పాటు నాసిక్ ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది.

మత విశ్వాసాల ప్రకారం, ఈ సందర్భంగా పవిత్ర నదులలో స్నానం చేయడం మోక్షానికి దారి తీస్తుంది. అయితే ప్రతి 12 సంవత్సరాలకు మాత్రమే ఈ విశిష్ట కార్యక్రమం ఎందుకు జరుగుతుందో తెలుసా? వాస్తవానికి, ఈ జాతర నిర్వహణ వెనుక లోతైన పౌరాణిక విశ్వాసాలు , సంప్రదాయాలు ఉన్నాయి.


హిందూ క్యాలెండర్ ప్రకారం.. మహాకుంభం పౌష పూర్ణిమ రోజున ప్రారంభమై మహాశివరాత్రితో ముగుస్తుంది. 2025 సంవత్సరంలో, మహాకుంభం జనవరి 13న ప్రారంభమై 26 ఫిబ్రవరి 2025న ముగుస్తుంది. మహాకుంభమేళా ఈ మధ్య గల 45 రోజుల పాటు కొనసాగనుంది.

మహా కుంభమేళా 2025 ప్రధాన తేదీలు:
13 జనవరి 2025: పౌష్ పూర్ణిమ
14 జనవరి 2025: మకర సంక్రాంతి
29 జనవరి 2025: మౌని అమావాస్య
3 ఫిబ్రవరి 2025: బసంత్ పంచమి
12 ఫిబ్రవరి 2025: మాఘ పూర్ణిమ
26 ఫిబ్రవరి 2025: మహాశివరాత్రి

కుంభమేళా యొక్క మూలం సముద్ర మథనం యొక్క పురాతన కథతో ముడిపడి ఉందని నమ్ముతారు. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతాన్ని పొందేందుకు సముద్రాన్ని మధించారు. దేవతలు , రాక్షసుల మధ్య 12 రోజుల పాటు అమృత కలశం విషయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో అమృతం యొక్క కొన్ని చుక్కలు 12 ప్రదేశాలలో పడ్డాయట. వాటిలో నాలుగు ప్రదేశాలు భూమిపై ఉన్నాయని చెబుతారు. అవే ఇప్పడు కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రాంతాలు.

ఈ ప్రదేశాలలో కుంభమేళా నిర్వహించబడటానికి కారణం కూడా ఇదే. జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం ప్రతి 12 సంవత్సరాలకు 12 రాశుల చక్రాన్ని పూర్తి చేస్తుంది. బృహస్పతి ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహించబడుతుంది.

Also Read: 12 రాశుల వారి జాతకం డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందంటే ?

నదీ స్నానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతం వలె స్వచ్ఛంగా మారుతుందని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో భక్తులు స్నానాలు చేయడానికి సుదూర ప్రాంతాల నుండి వస్తారు. గంగా, యమున , సరస్వతి కలిసే ప్రయాగ్‌రాజ్ సంగమ ప్రదేశం ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు చేసి తమ పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందే ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×