Vignesh Shivan: ప్రస్తుతం కేవలం తమిళ సినీ పరిశ్రమలోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం వైరల్ అయిన హాట్ టాపిక్ ధనుష్ వర్సెస్ నయరతార. నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ విడుదలయినప్పటి నుండి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. చిన్న విషయాన్ని కూడా ధనుష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని నయనతార ఫ్యాన్స్ అనగా.. ధనుష్ వల్లే నయనతార స్టార్ హీరోయిన్ అయ్యింది అనే విషయాన్ని తను మర్చిపోయిందని ధనుష్ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి ధనుష్‌కు, నయనతారకు మధ్య జరుగుతున్న గొడవలో నయన్ భర్త విఘ్నేష్ శివన్‌పై భారీ ఎఫెక్ట్ పడుతుండగా తను సోషల్ మీడియా నుండి కనిపించకుండా మాయమయిపోయాడు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
ధనుష్ (Dhanush), నయనతార (Nayanthara) కాంట్రవర్సీ ప్రారంభం అయినప్పటి నుండి కొందరు కావాలనే విఘ్నేష్ శివన్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ ట్రోల్స్‌ను తట్టుకోలేక తను తన ట్విటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసినట్టు సమాచారం. ధనుష్, నయన కాంట్రవర్సీ ప్రారంభం అయిన తర్వాత ధనుష్‌కు వ్యతిరేకంగా ఒక రీల్‌ను పోస్ట్ చేశాడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan). దీంతో తను ధనుష్ ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యాడు. దీంతో చాలాకాలం క్రితం తను దర్శకుడిగా డెబ్యూ చేసిన మొదట్లో ధనుష్‌ను ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలను, ఆ స్పీచ్ వీడియోను తనకు వ్యతిరేకంగా ఉపయోగించారు ఫ్యాన్స్. ఆ వీడియోలో ధనుష్ వల్లే తన డ్రీమ్ సినిమాను డైరెక్ చేయగలిగానని విఘ్నేష్ చెప్పుకొచ్చాడు.
Also Read: సరిగ్గా వన్ ఇయర్ క్రితం వైలెన్స్ అంటే ఏంటో చూపించాడు
అన్నీ అబద్ధాలే
ఒకవైపు ధనుష్ వర్సెస్ నయనతార కాంట్రవర్సీ ట్రెండ్ అవుతున్న సమయంలోనే విఘ్నేష్ శివన్.. కోలీవుడ్ దర్శకులతో కలిసి ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. తాను డైరెక్ట్ చేసిన ‘నానుమ్ రైడీ ధాన్’ మూవీని ప్రశంసించారని, ఆ సమయంలో ఆయన నటించిన ‘యెన్నై ఆరిందాళ్’లో తాను ఒక పాట రాస్తున్నానని చెప్పుకొచ్చాడు విఘ్నేష్ శివన్. ఈ స్టేట్‌మెంట్ వల్ల కూడా తనపై ట్రోలింగ్ మొదలయ్యింది. ‘యెన్నై ఆరిందాళ్’ సినిమా ‘నానుమ్ రౌడీ ధాన్’ కంటే 7 నెలల ముందే విడుదలయ్యిందని ప్రేక్షకులు కనిపెట్టారు. అయితే విఘ్నేష్ కావాలనే అబద్ధాలు చెప్తున్నాడని తనపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ఫ్యాన్ వార్ మొదలు
నయనతార ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్’ అనే డాక్యుమెంటరీ విడుదలయినప్పటి నుండే ఇదంతా మొదలయ్యింది. అందులో ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా నుండి ఫుటేజ్ ఉపయోగించడానికి తనను అనుమతి అడగలేదని ధనుష్.. నయనతారపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. దీంతో నయనతార కూడా ఇన్‌డైరెక్ట్‌గా ధనుష్ గురించి ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో స్టోరీలు షేర్ చేయడం మొదలుపెట్టింది. అలా ఇద్దరి స్టార్ల మధ్య గొడవ.. ఫ్యాన్స్ మధ్య గొడవగా మారింది. దీని వల్ల విఘ్నేష్ శివన్‌పై భారీ ఎఫెక్ట్ పడింది.