Big Stories

Yellow Shells:పూజలో బేసి సంఖ్యలో పసుపు గవ్వలే ఎందుకు ఉంచాలంటే

Yellow Shells:అరుదుగా దొరికే పసుపు గవ్వలకు విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వుంది. గవ్వలు లక్ష్మీదేవి చెల్లెలని , శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు.ఇవి లేత పసుపు రంగులో కాస్త చిన్నవిగా వుంటాయి. పసుపు గవ్వలతో బగళాముఖి మాతను ఆరాధిస్తే.. శత్రుపీడ తొలగిపోతుంది. జాతకంలో గురుబలం తక్కువగా వున్నవారు, రాహు కేతు దోషాలు వున్నవారు పసుపు గవ్వలను పూజా మందిరంలో వుంచి వాటికి ధూప దీపాలను సమర్పించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -

ఎలాంటి పూజలోనైనా పసుపు గవ్వలను బేసి సంఖ్యలో ఉపయోగించడమే మంచిది. పదకొండు పసుపు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి శుక్రవారం రోజున పూజించి.. ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచినట్లైతే.. ఆర్థిక పురోగతి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గవ్వలను హిందూ మతంలో స్వరూపంగా కొలుస్తారు. గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా దీపావళి రోజు ఈ శబ్ధం ఇంటికి మంచిది.

- Advertisement -

గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం.ది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉంటాయి. కొత్తగా కొన్న వాహనాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టి దోషం లేకుండా చేసుకునే సాంప్రదాయంగా వస్తోంది. గృహ నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. వివాహ సమయములలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే నరదృష్టి తాకకుండా కాపురం చక్కగా ఉంటుందని కొన్ని ప్రాంతాల వారు విశ్వసిస్తారు. గృహ నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహ ప్రవేశం చేసే వారు గుమ్మానికి గుడ్డలో గవ్వలను కడతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News