Goddess Durga: సనాతన ధర్మం ప్రకారం నవరాత్రి అత్యంత పవిత్రమైన పండగ. నవరాత్రి ఏడాదికి నాలుగు సార్లు వస్తుంది. వీటిలో రెండు గుప్త రాత్రులు కాగా.. ఒకటి చైత్రనవరాత్రి, మరొకటి శారదీయ నవరాత్రి. వీటిలో శారదీయ నవరాత్రి చాలా ముఖ్యమైంది. ఈ సమయంలో చాలా మంది ఇళ్లలొ , దేవాలయాల్లో దుర్గాదేవిని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఈ ఏడాది నవరాత్రి పండగ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 1న ముగుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సమయంలో దేవత పూజలో ఎరుపు రంగు పువ్వులను సమర్పించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దుర్గాదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించడం చాలా శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ పూజ వల్ల అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. దుర్గాదేవి శక్తికి, సాహసానికి చిహ్నం. ఆమెకు ఎరుపు రంగు చాలా ప్రీతిపాత్రమైనది. ఎరుపు రంగు శక్తి, తేజస్సు, ప్రేమకు ప్రతీక. అందుకే, నవరాత్రి పూజలో ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా ఎర్ర గులాబీలు, మందార పువ్వులు, ఎర్ర కలువ పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు.
పురాణాల ప్రకారం.. ఎర్రటి పువ్వులు దుర్గాదేవికి అత్యంత ఇష్టమైనవి. వాటిని పూజలో ఉపయోగించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అంతేకాక.. ఈ పువ్వులు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంట్లో శాంతి, సంపద, సంతోషం నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తారు. నవరాత్రి సమయంలో ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల దురదృష్టం తొలగిపోయి, అదృష్టం వరిస్తుందని చెబుతారు. కాబట్టి.. ఈ నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని ఎర్రటి పువ్వులతో పూజించడం అస్సలు మరచిపోవద్దు.
నవరాత్రి సమయంలో భక్తులు ఉపవాసం ఉండి.. దుర్గాదేవిని భక్తితో పూజిస్తే, అమ్మ వారి జీవితాల్లోని అన్ని కష్టాలను తొలగించి, వారిని రక్షిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో ఆమెకు ఇష్టమైన పువ్వులు, ఆహారం, ఎర్రటి దుస్తులను సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.
Also Read: ఇంట్లో తాబేలును ఈ దిశలో ఉంచితే.. డబ్బుకు లోటుండదు !
దుర్గాదేవికి ఇష్టమైన పువ్వులు ఏంటి ?
అపరాజిత పూలు:
దుర్గాదేవి పూజ సమయంలో అపరాజిత పువ్వును కూడా సమర్పించవచ్చు. ఈ పూలు దేవిని సంతోషపరుస్తాయి. అంతే కాకుండా వీటితో పూజించడం వల్ల మీ కోరికలన్నింటినీ ఆ తల్లి నెరవేరుస్తుంది. దుర్గా సప్తశతిలో కూడా ఈ పువ్వుల గురించి ప్రస్తావించారు. ఎరుపు రంగు శక్తి, శౌర్యం, శ్రేయస్సును సూచిస్తుంది. కాబట్టి ఈ పూలను దేవత ఆరాధనలో ఎక్కువగా ఉపయోగిస్తారు.