School Teacher: స్కూల్.. టీచర్లు.. పిల్లలు.. ఆటలు.. పాటలు.. ఎన్నో సరదా ముచ్చట్లు.. ఎడ్యుకేషనల్ లైఫ్ లో స్కూల్ లో గడిపిన పదేళ్లు ఎప్పటికీ మరిచిపోలేం.. ఓ పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం హోమ్ వర్క్ సరిగ్గా చేయకపోతే టీచర్లు కర్రతో చేతులపై రెండు దెబ్బలు కొట్టేది.. ఆ మరుసటి రోజే స్టూడెంట్స్ మరిచిపోయేది.. అదే ఈ రోజుల్లో హోం వర్క్ చేయపోయనా.. బాగా చదవక పోయినా కొట్టే టీచర్ల సంఖ్య చాలా రేర్.. పిల్లలను కొట్టినట్టు ఎక్కడో ఓ చోట వార్తల్లో చూస్తుంటాం.. అయితే ఆ పనిష్ మెంట్ ఏదో రెండు దెబ్బలతో ముగిస్తే పర్లేదు.. పిల్లాడు అని చూడకుండా ఇష్టమొచ్చినట్టు కొడితేనే సమస్యలను తెచ్చిపెడుతోంది. తాజాగా ఏపీ రాష్ట్రంలోని ఏలూరు నగరంలో ఓ పాఠశాలలలో ఓ టీచర్ ను స్టూడెంట్ ను చితకబాది.. ఆపై కొరికన ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
⦿ D అనే పదం పలకకపోవడంతో చితకబాదాడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు నగరంలో తంగెళ్లమూడిలో ఒక ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఆరో తరగతి చదువుతున్న అహల్ అనే విద్యార్థి D అనే పదం సరిగ్గా పలకలేకపోయాడు. దీంతో టీచర్ ఆగ్రహానికి గురయ్యాడు. స్టూడెంట్ అహల్ ను ఇష్టమొచ్చినట్టు చితకబాదాడు. చిన్న పిల్లాడు అని చూడకుండా కొట్టడమే కాకుండా.. మీద పడి నోటి కొరికినట్టు స్టూడెంట్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఇంగ్లిష్ లో డీ అనే పదం పలకకపోతే అలా కొడుతారా అని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
⦿ పోలీసులకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్..
ఈ క్రమంలో విద్యార్థి అహల్ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. తన కొడుకు పరిస్థితి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ పై పాఠశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలుడి పేరెంట్స్ ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రస్తుతం టీచర్ ఉదయ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ టీచర్ ను విచారిస్తున్నారు.
ALSO READ: Dussehra Holidays: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు, ఎప్పటి వరకు అంటే..?
⦿ మీద పడపడి కొరకడం ఏంటి..? నెటిజన్లు FIRE
ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆంగంలో డీ అనే పదం పలకకపోతే అలా చితక బాదుతారా..? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు.. ‘డీ అనే వర్డ్ పలకకుంటే.. నెమ్మదిగా నేర్పించాలి కానీ.. అలా మీద పడి కొరకడం ఏంటి..?’ అని ప్రశ్నించాడు. మరి కొంత మంది టీచర్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ALSO READ: Chimpanzee: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!