Big Stories

Tamil Nadu Elections 2024: తమిళనాడులో ఓటేసిన 102 ఏళ్ల బామ్మ..

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ తమిళనాడులో జరిగింది. 102 ఏళ్ల బామ్మ రెడ్డియార్చత్రంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ వృద్ధురాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నమ్మాళ్ అనే వృద్ధురాలు దిండిగల్ జిల్లా రెడ్డియార్చత్రంలోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చింది. పోలింగ్ కేంద్రానికి చేతి కర్రతో వచ్చిన ఆమె సరిగా నిలబడలేని స్థితిలో ఉంది. అయినప్పటికీ ఓటు వేసి అక్కడనుంచి తిరిగి వెళ్లింది.

- Advertisement -

పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధాప్యం కారణంగా చిన్నమ్మాళ్ సరిగ్గా నిలబడలేకపోయారు. అయినప్పటికీ, ఆమె దేశం పట్ల తన కర్తవ్యాన్ని మరవలేదు..రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేసే ప్రజలకు ఈ వృద్ధురాలు ఆదర్శంగా నిలిచింది. 102 ఏళ్ల బామ్మ పోలింగ్ బూత్‌కు రావడంతో స్థానికంగా ఇది చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే వారికి ఈమె రోల్ మోడల్‌గా నిలిచారు.

- Advertisement -

Also Read: సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్

తమిళనాడులోని 39 నియోజకవర్గాల్లో నిన్న పోలింగ్ జరగగా..ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. గత ఎన్నికలో తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 40 సీట్లలో 39 స్థానాల్లో డీఎంకే నేతృత్వం భారీ విజయం సాధించింది. ఇక్కడ 950 మంది అభ్యర్థులు అధికారం కోసం పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల ఫలితాలు జూన్ 4న  వెలువడనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News