BigTV English

PM Modi Comments on Rahul Gandhi: ఓడిపోతున్నామని తెలిసినా.. ఎందుకు కష్టపడాలి..? : పీఎం మోదీ

PM Modi Comments on Rahul Gandhi: ఓడిపోతున్నామని తెలిసినా.. ఎందుకు కష్టపడాలి..? : పీఎం మోదీ

PM Modi Fires on Rahul: ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని నాందేడ్ లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటితో తొలి విడత పోలింగ్ పూర్తయింది.. ఓటు వేసినవారందరికీ మరియు మొదటిసారి ఓటు వేసినవారికి నా అభినందనలు, కృతజ్ఞతలు’ అంటూ ఆయన పేర్కొన్నారు.


అయితే, ఓటింగ్ ముగిశాక బూత్ స్థాయిలో జరిగిన విశ్లేషణలు, అందిన సమాచారం ప్రకారం తొలి దశలో ఎన్డీయేకు ఏకపక్ష ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.కాంగ్రెస్ యువరాజు అయిన రాహుల్ గాంధీ కూడా వాయనాడ్‌లో సంక్షోభాన్ని చవిచూడబోతున్నారని మోదీ అన్నారు. షాజాదే మరియు అతని బృందం ఏప్రిల్ 26వ తేదీన వాయనాడ్‌లో ఓటింగ్ కోసం ఎదురు చూస్తున్నారని.. అయితే, అతను అమేథీ నుండి పారిపోవాల్సి వచ్చినట్లే, వాయనాడ్ వదిలివెళ్లిపోతాడని మీరు ఊహించవచ్చు అంటూ మోదీ చెప్పారు.

Also Read: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు.. మన దేశంలో రేషన్ ఫ్రీ: యూపీ సీఎం


ఇతర పార్టీలపై విరుచుకుపడిన మోదీ.. ‘ఎన్నికల్లో ఓడిపోతున్నామని భావించినా, ఎందుకు కష్టపడాలి – ప్రజాస్వామ్యం కోసం కష్టపడండి’ అని నేను చెప్పాలనుకుంటున్నాను .’ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు. ఇంకోరోజు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఆ అవకాశం వస్తుంది’ అని మోదీ అన్నారు. వచ్చే ఐదేళ్లలో నాందేడ్‌, మహారాష్ట్రలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని మోదీ అన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×