Big Stories

Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ నుంచి కొత్త EV.. మేలో లాంచ్.. ఆకట్టుకుంటున్న ధర & ఫీచర్లు..

Bajaj Chetak Electric Scooter 2024 Features: స్కూటర్లు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. మంచి లుక్‌ను అందిస్తాయి. దీంతో కాలేజీకి వెళ్లే వారి నుంచి జాబ్ చేసే యూత్ వరకు స్కూటీలను ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీతో వీటి వాడకం భారీగా పెరిగింది. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందజేసి ఈవీ రంగ అభివృద్దికి తోడ్పడుతున్నాయి.

- Advertisement -

ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో తన చేతక్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేయాలని చూస్తోంది. కంపెనీ మే నెలలో చేతక్ బ్రాండ్ క్రింద కొత్త మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. అయితే కంపెనీ తన రిటైల్ ఫుట్‌ప్రింట్‌ను రాబోయే కొద్ది నెలల్లో మూడు రెట్లు పెంచాలని భావిస్తోంది.

- Advertisement -

బజాజ్ ఆటో చేతక్ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో ప్రస్తుతం రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. చేతక్ అర్బన్, చేతక్ ప్రీమియం. అర్బన్ ప్రారంభ ధర రూ. 1.23 లక్షలు కాగా, ప్రీమియం ప్రారంభ ధర రూ. 1.47 లక్షలుగా ఉంది.

Also Read: వెస్పా స్పెషల్ ఎడిషన్.. 140 మందికే ఛాన్స్..!

బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ స్కూటర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.  నాల్గవ త్రైమాసికంలో ఉత్పత్తి మరింత ఎక్కువ జరిగిందని తెలిపారు. అంతే కాకుండా మే నాటికి కొత్త ఉత్పత్తిని ప్రారంభిస్తామని అన్నారు. కొత్త మోడల్‌‌తో మాస్ సెగ్మెంట్‌లో మే పడతామని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ధర గురించి వివరించలేదు.

అయితే ధర ఎక్కువగా ఉందడని అన్నారు.  ఇది ఎక్కువ మందిని ఆకర్షించే ఉత్పత్తి అవుతుందన్నారు. కొత్త మోడల్‌లో చిన్న బ్యాటరీ. హబ్ మోటార్ ఉండే అవకాశం ఉంది. బజాజ్ చేతక్ ఒక టెస్ట్ మ్యూల్ గత సంవత్సరం హబ్-మౌంటెడ్ మోటారుతో టెస్ట్ రన్ చేస్తున్నట్టు వెల్లడించారు. అదే మోడల్ రాబోయే ఈ లాంచ్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: అదరగొడుతున్న టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ..!

బజాజ్ ఆటో జనవరి 2020లో EV మార్కెట్లోకి ప్రవేశించింది. FY24లో 1,06,431 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేసింది.కంపెనీ మార్కెట్ వాటా 14 శాతానికి కూడా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజాజ్ చేతక్ 164 నగరాల్లో దాదాపు 200 స్టోర్లను కలిగి ఉంది. కంపెనీ రానున్న మూడు, నాలుగు నెలల్లో స్టోర్ల సంఖ్యను దాదాపు 600కి పెంచే ఆలోచనలో ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News