Big Stories

Tejashwi Yadav Comments: సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్..

RJD Leader Yadav Sensational Comments on Elections Results: లోక్ సభ ఎన్నికల మొదటి దశ ముగిసిన తరువాత రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వీ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ‘400 పార్’ సినిమా మొదటి రోజే ఫ్లాప్ అయ్యిందని ఆయన అన్నారు. ప్రముఖ జాతీయ మీడియా చానెల్ తో ఆయన మాట్లాడుతూ బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో బీహార్ ప్రజలు షాకింగ్ రిజల్ట్ ఇస్తారన్నారు. మొదటి దశలో నిర్వహించిన అన్ని స్థానాల్లో మహాగత్ బంధన్ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ‘400 పార్’ సినిమా మొదటి రోజే ఫ్లాప్ అయ్యిందని యాదవ్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

బీహార్ ప్రజలు షాకింగ్ రిజల్ట్ ఇవ్వబోతున్నారని తాను చాలాసార్లు చెప్పానన్నారు. బీహార్ ప్రజల కోసం బీజేపీ ఏమీ చేయలేదన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదని, అందుకే ప్రజలు బీజేపీ పట్ల విసిగిపోయారన్నారు.

- Advertisement -

Also Read: ముగిసిన తొలి విడత లోక్ సభ ఎన్నికలు.. టాప్‌లో త్రిపుర..!

బీహార్ లో నిరుద్యోగం అనేది పెద్ద సమస్య అని, అదేవిధంగా ప్రజలకు పనులు దొరుకక ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నారని.. వరదల వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తేజస్వీ యాదవ్ అన్నారు. అందుకే బీహార్ ప్రజలు బీజేపీకి ఓటు వేయరని, దీంతో బీజేపీ బాధపడుతుందని యాదవ్ జోస్యం చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News